దారుణం: క్షుద్రపూజల పేరుతో భార్య గొంతుకోసి బలి
నిజామాబాద్: నగరంలోని వినాయక్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో కట్టుకున్న భార్యనే చంపేశాడు ఓ కిరాతక భర్త. కాళ్లు చేతులు కట్టేసి.. గొంతుకోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు నవీన్‌కు, బాధితురాలు సవితకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన కొద్ది రోజుల నుంచే భార్యతో తరచూ గొడవపడేవాడు నవీన్. పలుమార్లు ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.

ఈ క్రమంలో శనివారం క్షుద్ర పూజలు నిర్వహించిన నవీన్.. సవిత కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి హత్య చేశాడు. ఆమె అరుపులు బయటికి రాకుండా లౌడ్ స్పీకర్లతో పాటలు పెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి మెడ, ఇతర శరీర భాగాలపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వివాహం చేసుకున్న నాటి నుంచి భార్యను వేధిస్తుండేవాడని చెప్పారు. నిందితుడ్ని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించిన కథనాలు పలు వార్తా ఛానళ్లలో ప్రసారమయ్యాయి.












Click it and Unblock the Notifications