యువతితో నాలుగేళ్లుగా సహజీవనం చేసి వదిలేశాడు

బాధితురాలి పోలీసులకిచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన రాంరెడ్డి కుమారుడు మర్రిరెడ్డి వెంకట్ రెడ్డి(27) అమీర్‌పేటలో హాస్టల్ ఉంటూ పులివెందులకు చెందిన అనాథ యువతి(24)తో పరిచయం పెంచుకున్నాడు.
ఇద్దరూ యూసుఫ్‌గూడ లక్ష్మినర్సింహనగర్‌లో ఓ అద్దె ఇంట్లో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆ యువతికి వెంకట్ రెడ్డి ఇప్పటికే మూడు సార్లు అబార్షన్ చేయించాడు. ఇటీవల వెంకట్ రెడ్డి ముఖం చాటేసి తిరుగుతుండటంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించారు. నిందితుడి తండ్రి రాంరెడ్డిని పోలీసులు విచారించగా.. బాధిత యువతితో తన కుమారుడు సహజీవనం చేసిన విషయం వాస్తవమేనని చెప్పాడు. అయితే వారి వివాహం విషయంలో మాత్రం అతడు స్పష్టత ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications