ఫేస్‌బుక్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యలు

హైదరాబాద్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో అసభ్యపదజాలంతో సందేశాలు పెట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసిన తుమ్మల రమేష్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

ఫేస్‌బుక్‌లో తనపై ఓ వ్యక్తి అసభ్య వ్యాఖ్యలు చేశారని జీవన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు రమేష్ రెడ్డిని గురువారం అరెస్ట్ చేశారు.

A man arrested for objectionable comments in facebook on TRS MLA

యుఏఈకి చెందిన ఓ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని జీవన్ రెడ్డి ఎగవేసినట్లు, అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్మూరు ప్రజల్ని జీవన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేరస్తున్నారని రమేష్ రెడ్డి ఫేస్‌బుక్ సందేశాలను పోస్టు చేశాడు.

దీంతో తన పరువుకు నష్టం కలిగేలా రమేష్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు, నిందితుడు రమేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+