Crime News: గాసిప్ వెబ్ సైట్‍తో సినీ, రాజకీయ ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి..

అదో "గ్రేట్" వెబ్ సైట్.. అందులో ఇష్టమొచ్చినట్లు రాస్తుంటారు. డబ్బులిస్తే.. ఒకే.. లేకుంటే.. అంతే వ్యతిరేకంగా రాయడం మొదలు పెడతారు. డబ్బులిచ్చేదాక వెంటపడుతుంటారు. ఇలా అతను రాజకీయ నాయకులు, సినీ స్టార్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. చివరికి అతని బండారం బయట పడింది. సదరు వ్యక్తిని ఏపీకి చెందిన వాడిగా గుర్తించారు. అయితే ఇతనికి జర్నలిజంలో అనుభవం లేదు. అయినప్పటికి గాసిప్ వెబ్ సైట్ నడిపాడు.

తనను తాను మీడియా వ్యక్తిగా చెప్పుకుంటూ పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత తన "గ్రేట్" వెబ్‌సైట్‌ను ఉపయోగించి సెలబ్రిటీలను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. 2019 వరకు అతని వెబ్‌సైట్ కొద్దిమంది సినీ నిర్మాతల నుంచి డబ్బులు వసూలు చేసేది. ఆ తర్వాత అతని బ్లాక్ మెయిలింగ్ మారింత పెరిగింది. 2019లో ఏపీలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతను మరింత స్పీడ్ పెంచాడు.

A man blackmailed movie and political celebrities with a gossip website

తనను తాను సీఎంకు అత్యంత సన్నిహితులలో ఒకడిగా చెప్పుకున్నాడు. తనకు.. సీఎం చాలా దగ్గరని చెప్పుకున్నాడు. తాను సీఎంకు దూరపు బంధువని చెప్పుకునే స్థాయికి చేరాడు. ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులను చేశానని చెప్పుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు సినీ పరిశ్రమలోని చాలా మంది ఆయన సన్నిహితులని చాలా మంది నమ్మారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు, సినీ తారల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.

అయితే అతనికి లొంగని వారిపై తన "గ్రేట్" వెబ్ సైట్ ద్వారా వ్యతిరేక వార్తలు రాయించేవాడు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తుంటాడు. అధికార పార్టీలో నాయకులు, సీఎం తన వార్తా కథనాలను క్రమం తప్పకుండా అనుసరిస్తారని అతను చెప్పుకునే వాడు. కథనాలు చూపించి ఎమ్మెల్యేల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కో వ్యక్తికి రూ. 10 లక్షలు వసూలు చేసేవారు. వారు చెల్లించడానికి అంగీకరించకపోతే వ్యతిరేక కథనాలు రాసే వాడు.

అతను వసూలు చేసిన డబ్బులతో తన పిల్లలకు పెద్ద యూనివర్సిటీల్లో సీట్లు కొనుగోలు చేశాడు. బెంగళూరులో ఆస్తులు కొనుగోలు చేశాడు.సినిమా తారలు, దర్శకులు, నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లలో వసూలు చేసే వాడు. ఏ సినిమా నిర్మాత అయినా బ్యానర్‌లో ప్రకటన ఇవ్వడానికి నిరాకరించినట్లయితే.. ఆ సినిమా బాగాలేదని తన వెబ్ సైట్ లో రాసేవాడు. అందుకే చాలా మంది నిర్మాతలు అతనికి డబ్బులు చెల్లించే వారు.

అతని బ్లాక్ మెయిలింగ్ డబ్బు వసూళ్లకు సినీ తారలు, రాజకీయ నాయకులు విసిగిపోయారు. కానీ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అతనికి ముఖ్యమంత్రి సంబంధం లేదని.. అతనో మోసగాడని తెలిసింది. పోలీసులు అతని బండారాన్ని బయట పెట్టారు. అతను తన బ్లాక్ మెయిలింగ్ వ్యూహాలను కొనసాగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచుంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+