‘ఈ ప్రపంచంలో ఉండలేను’: రైలు కిందపడి మెడికో ఆత్మహత్య
ఈ ప్రపంచంలో ఉండలేనంటూ ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అనంతపురం నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న యశ్వంత్ అనే
అనంతపురం: ఈ ప్రపంచంలో ఉండలేనంటూ ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అనంతపురం నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థి లక్ష్మీనగర్ సమీపంలో గురువారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 'ఈ ప్రపంచంలో నేను ఉండలేను. నా చావుకు ఎవరూ కారణం కాదు' అని యశ్వంత్ రాసిన లేఖను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

యశ్వంత్ స్వస్థలం హిందూపురం సమీపంలోని చోళసముద్రం. అతడి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కళాశాలలో చేరినప్పటి నుంచి యశ్వంత్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కుటుంబసభ్యులు కూడా యశ్వంత్‌తోనే ఉంటున్నారు. కాగా, గురువారంతో పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో అతడు ఆత్మహత్యకు పాల్పడటం యశంత్ కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని నింపింది.












Click it and Unblock the Notifications