మాయమాటలు చెప్పి యువతిని గర్భవతిని చేసిన వృద్ధుడు

ఆదిలాబాద్: జిల్లాలో ఓ బాలిక(16)ను 80 ఏళ్ల వృద్ధుడు గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం రాత్రి వెలుగుచూసింది. బెల్లంపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను, ఇంటి సమీపంలోని వృద్ధుడు మాయమాటలతో ఆరునెలల కిందట లొంగదీసుకున్నాడు.

అప్పటి నుంచి లైంగికదాడి చేస్తూనే ఉన్నాడు. బాలిక గర్భం దాల్చింది. తరచూ కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆదివారం ఆస్పత్రిలో చూపించారు. నాలుగు నెలల గర్భమని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. బాలికను ఏమైందని అడగ్గా, అసలు విషయం చెప్పింది. తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

A old man raped teen girl

చలిమంటలో పడి వృద్ధుడి మృతి

కౌటాల మండలంలోని కౌటి గ్రామానికి చెందిన ఎల్ములె జుంగ(70) అనే వృద్ధుడు ఆదివారం ఉదయం చలిమంటలో పడి మృతి చెందాడు. జుంగ వేకువజామున చలిమంట వేసుకున్నాడు. ఈ సమయంలో మూర్ఛ వ్యాధి రావడంతో మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

బస్సు అదుపు తప్పి ఏడుగురికి గాయాలు

బెజ్జూరు మండల కేంద్రం నుంచి కాగజ్‌నగర్‌ వైపు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కుదుపులకు లోనయిన సంఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రం నుంచి ఆదివారం బస్సు కాగజ్‌నగర్‌ వైపు వెళుతుండగా ఎల్కపల్లి(పి) గ్రామంలో అక్కడ వేసిన భారీ సైజు కట్టెమొద్దుపైకి బస్సు వెళ్లడంతో అదుపు తప్పి కుదుపులకు లోనయింది.

దీంతో అందులో ప్రయాణిస్తున్న కామెర బాబాజీ, సునీత, అల్లూరి దుర్గయ్య, దహెగాం మండలం ఐనంకు చెందిన రుక్మిణి, దహెగాంకు చెందిన శంకరమ్మ, సలుగుపల్లికి చెందిన లక్ష్మి, బెజ్జూరు హోంగార్డు జనార్దన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో ము గ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను 108లో కాగజ్‌నగర్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+