ఉద్యోగుల సంఘం నేతపై ఏపీ హైకోర్టులో పిటీషన్: జగన్ ప్రభుత్వం తీరుపైనా..!!
అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డిపై ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. సీనియర్ అడ్వొకేట్ శ్రావణ్ కుమార్ ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను కించపరిచేవిగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడాన్నీ తప్పుపట్టారు.
ఇటీవలే వెంకట్రామిరెడ్డి న్యాయవ్యవస్థపై వ్యాఖ్యానాలు చేశారు. న్యాయవ్యవస్థలో ఉండే లోపాలపైన చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. న్యాయమూర్తులను పనితీరును తప్పు పడుతూ వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు చేసినా మూడు నెలల పాటు బెయిల్ రాదని, అలాంటిది- విలేకరుల సమావేశాన్ని పెట్టి బహిరంగంగా ముఖ్యమంత్రిని తిట్టిన వారికి గంటలో బెయిల్ వచ్చే పరిస్థితులను రాష్ట్రంలో ఏర్పడ్డాయని చెప్పారు.

న్యాయమూర్తులకు మాత్రమే ఆత్మాభిమానం ఉంటుందా?, ముఖ్యమంత్రులకు ఉండదా? అని ప్రశ్నించారు. ఇదివరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఆ తరువాత న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. హైకోర్టు వ్యవహారశైలిపై న్యాయ నిపుణులు సైతం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోన్నారని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అడ్వొకేట్ శ్రావణ్ కుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ జ్యుడీషియరీ వ్యవస్థ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని చెప్పారు. న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగానికి, సర్వీసు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.
అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంకట్రామిరెడ్డిపై ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకోవాల్సి ఉండేదని, అలా జరగలేదని అన్నారు. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేయకపోవడం దురదృష్టకరమని శ్రావణ్ కుమార్ అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకు మచ్చగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల ప్రతినిధులు తమ నిరసనలను తెలియజేయాలని అన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications