కోడెల ఫ్యామిలీని వెంటాడుతున్న కేసులు.. కొడుకు.. కూతురు.. ఇప్పుడు మాజీ స్పీకర్! ఇంకా ఎన్ని?
కే టాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న ఏపీ మాజీ స్పికర్ కోడేల శివప్రసాద్ కుటుంభంపై మరో కేసు నమోదు అయింది. రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కోడేల శివరామ్ ఆంధ్ర రంజీ క్రికెట్ క్రిడాకారుడి వద్ద డబ్బలు వసూలు చేశాడని నరసారావు పేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

రంజీ క్రికెటర్ వద్ద ఉద్యోగం పేరుతో 15లక్షల వసూలు
ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న కోడేల కుటుంభంపై మరోకేసు నమోదు అయింది. శ్రీకాకుళం జిల్లా పోలాకీ మండలం యవ్వారీపేటకు గ్రామానికి చెందిన నాగరాజు గత అయిదు సంవత్సరాలుగా ఆంధ్ర రంజీ జట్టు నుండి క్రికెట్ అడుతున్నాడు. నాగరాజుకు రైల్వే శాఖలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కోడేల శివరాం 15 లక్షల రుపాయలు వసూలు చేశాడని, అయితే ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని, తిరిగి డబ్బలు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని నాగరాజు నరసారావు పేట డీఎస్సీకి పిర్యాధు చేశారు.

విషయం చెప్పినా స్పందించని మాజీ స్పీకర్
అయితే ఇదే విషయమై స్పికర్‌గా ఉన్న సమయంలో శివప్రసాద్ రావు సమాచారం ఇచ్చినా ఆయన స్పందించలేదని తెడలిపారు.ఇక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పి 15 లక్షలు తీసుకున్నట్టు శివరాం బాంబు ఇవ్వడంతో పాటు ఉద్యోగానికి సంబంధించి నియామక పత్రాలను ఇచ్చి కాన్పూర్‌కు వెళ్లమని చెప్పాడని , అయితే కాన్పూరుకు వెళ్లిన నాగరాజు అక్కడ ఉన్న వ్యక్తిని కలవడంతో రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ పడ్డప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి పంపించాడని తెలిపారు.

డబ్బులు ఇస్తామని దాడి...
అయితే కోడేల శివరాంపై ఇటివల వరుస కేసులు నమోదవుతుండడంతో గత వారం నాగరాజు కోడేల ఇంటికి ఉద్యగం విషయం వెళ్లాడు. దీంతో డబ్బలు ఇస్తామని చెప్పి రమ్మన్నారని, ఇంటికి వెళ్లిన తర్వాత కోడేల ఇంటివద్ద ఉన్న కొంతమంది ఆయన అనుచరులు నాగరాజుపై దాడి చేశారని,అనంతరం తన వద్ద బాండ్ పేపరును గుంజుకోవడంతో పాటు దాన్ని చింపి వేశారని నాగరాజు పిర్యాధు చేశారు.కాగా ఇప్పటికే కోడెల శివప్రసాద్ కూతురు, కుమారుడిపై ఇప్పటికే సుమారు 10 కేసులు నమోదయ్యాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications