ఫ్యాన్స్ గిఫ్ట్: పోస్టల్ స్టాంప్‌ పై జనసేన అధినేత, జన్మదినం సందర్భంగా విడుదల

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు పవన్ పేరుతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం ఆసక్తిగా మారింది. నిన్న విజయవాడలో ఈ పవన్ స్టాంప్ రిలీజ్ కార్యక్రమం జరిగింది.

అమరావతి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌ టాప్ హీరోగానే కాకుండా జనసేన అధినేతగా క్రియశీలక రాజకీయల్లో తనదైన ముద్రను వేసేందుకు 'జనసేన'ను స్థాపించి 2019 ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆ వైపు తన యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.

అయితే అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండు పడవలపై ప్రయాణం సాధ్యం కాదని భావించి త్వరలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారేందుకు ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ దశలో కమిట్ అయిన సినిమాలను త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు పవన్. ప్రస్తుతం పవన్ తన 25 చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.

A Postal Stamp on Pawan Kalyan, Released on account of his Birthday

ఇదిలాఉంటే.. ఈరోజు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు పవన్ పేరుతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం ఆసక్తిగా మారింది. నిన్న విజయవాడలో ఈ పవన్ స్టాంప్ రిలీజ్ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధి వెంకట మహేష్, పోస్టర్ అధికారులు పాల్గొన్నారు. తన అభిమాన నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు పవన్ ఫ్యాన్ మహేష్.

అయితే ఇటువంటి పోస్టల్ స్టాంప్‌లను సాధారణ ప్రజలు కూడా తయారు చేయించుకోవచ్చు. అందుకు కొంత రుసుమును హెడ్ పోస్టాఫీసులో చెల్లిస్తే చట్టబద్ధమైన స్టాంప్‌ను పొందవచ్చు. ఇలా పవన్ పేరిట విడుదలైన పోస్టల్ స్టాంప్ ఆకట్టుకునే విధంగా ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో కట్టలు తెంచుకున్న ఆవేశంతో పవన్ చేసిన ప్రసంగానికి సంబంధించినన ఫొటోతో.. బిగించిన పిడికిలిని జతచేసి ఈ స్టాంప్‌ను డిజైన్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+