రౌడీ షీటర్ దారుణ హత్య: మరో ఘటనలో యువకుడు

A rowdy sheeter allegedly killed in Krishna district
కృష్ణా/గుంటూరు: కృష్ణా జిల్లాలోని కంచికర్ల మండలం నెక్కలంపేటలో ఓ రౌడీ షీటర్‌ను దారుణంగా హత్య చేశారు. రౌడీ షీటర్ యార్లగడ్డ విజయ్‌ను పలువురు దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. విజయ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కాగా, విజయ్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో గుంటూరు జిల్లా వినుకొండ మండలం దొండపాడు-నడిగడ్డ మధ్య ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు.

దోపిడీ దొంగల బీభత్సం

కృష్ణా జిల్లాలోని బావులపాడు మండలం ఆరుగొలను వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దుండగులు లారీ డ్రైవర్ సహా ముగ్గురి గొంతుకోసి పరారయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం చేదువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి చెట్టు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ సెల్ ఫోన్‍‌లో మాట్లాడుతూ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+