‘నారాయణ’ మరో మరణం: సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి
నారాయణ కళాశాలలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. కాకినాడలోని నారాయణ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఒకరు అనునాస్పదస్థితిలో మృతిచెందాడు. అయితే, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉం
తూర్పుగోదావరి: నారాయణ కళాశాలలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. కాకినాడలోని నారాయణ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఒకరు అనునాస్పదస్థితిలో మృతిచెందాడు. అయితే, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
లక్ష్మీనారాయణ నగర్‌లో ఉన్న నారాయణ కాలేజీలో సెక్యూరిటీ గార్డు ఒకరు మంగళవారం రాత్రి మృతిచెందినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని బయటకు పోక్కకుండా కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. దీంతో ఈ సంఘటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఇప్పటికే విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోగల నారాయణ కాలేజీ యాజమాన్యాలపై పలు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతితో మరిన్ని చిక్కులు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications