నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందమైన యువతులంటూ ఫోన్లు: సెక్స్ రాకెట్ గుట్టురట్టు, యువతి, విటుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడ కేంద్రం సాగుతున్న మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. ఆన్‌లైన్‌లో ఫోన్‌ నెంబర్లు పెట్టి అందమైన యువతులు ఉన్నారంటూ యువకులకు వల వేసి, గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న వ్యభిచార ముఠాను రట్టు చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ముంబై నుంచి తీసుకువచ్చిన యువతులతో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్‌.. ప్రత్యేక నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం బట్టబయలు చేశారు.

అందమైన యువతులున్నారంటూ..

అందమైన యువతులున్నారంటూ..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన మందారపు నాగేశ్వరరావు కృష్ణలంక రాణిగారితోటలో ఉంటారు. విజయవాడలోని ఒక హోటల్‌లో అందమైన యువతులు ఉన్నారంటూ ఫోన్‌ నెంబరుతో సహా ఆన్‌లైన్‌లో పెట్టారు.

మూడు రోజులుగా..

మూడు రోజులుగా..

దీంతో పలువురు యువకులు ఆకర్షితులై ఆ నెంబరుకు ఫోన్‌ చేసి మూడు రోజులుగా కారల్‌మార్క్స్‌ రోడ్డులోని ఒక హోటల్‌లోని 303 రూముకు వెళ్లి వస్తున్నారు.

నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్

నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్

దీనిపై టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ప్రసాద్‌కు సమాచారం రావటంతో ఆయన ప్రత్యేక నిఘా ఉంచారు. పోలీసు సిబ్బందిని విటులుగా పంపి వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధరించుకున్నారు.

నిర్వాహకుడితోపాటు యువతి, విటుల అరెస్ట్

నిర్వాహకుడితోపాటు యువతి, విటుల అరెస్ట్

శనివారం మధ్యాహ్నం తన సిబ్బందితో దాడి చేసి నిర్వాహకుడు నాగేశ్వరరావుసహా ఇద్దరు విటులు మల్లేడి సత్యప్రకాశ్‌, బోయ రత్న, ముంబైకి చెందిన ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం గవర్నర్‌పేట పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A sex racket busted in Vijayawada on Saturday by task force police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X