తల్లి దండ్రులు పెట్రోల్ పోసుకుంటే... కోడుకు అగ్గిపుల్ల గీశాడు... !

పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రుల భాద్యత చూసుకోవాల్సిన కన్న కోడుకే వాళ్ల పాలిట యముడయ్యాడు. డబ్బుల కోసం కోడుకు చచ్చిపోతానంటే, నువ్వేందుకు చస్తావ్, మేమే చచ్చిపోతామంటూ పెట్రోల్ పోసుకుంటే ,కోడుకు అగ్గిపుల్ల గీసీ తల్లిదండ్రులపై వేసి వారి మృతికి కారణమయ్యాడు ఓ కొడుకు..మంటలకు ఆహుతి అవుతున్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇరుగుపొరుగు రావడంతో అక్కడి నుండి పరారయ్యాడు.

 ప్రకాశం జిల్లా మార్కాపురం లో దారుణం

ప్రకాశం జిల్లా మార్కాపురం లో దారుణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ప్రసాద్ అనే యువకుడిది గురువారం పుట్టిన రోజు. పుట్టిన రోజు పార్టీ కోసం తనకు డబ్బులు కావాలని తన తల్లిదండ్రులైన గాలయ్య, లక్ష్మీలను అడిగాడు. అయితే ఈ సంవత్సరం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని డబ్బులు లేవని వారు తెలిపారు. ఇలా రెండు మూడు రోజుల నుండి ఇద్దరి మధ్య ఘర్షన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రసాద్, తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. తల్లి
దండ్రులు ఎంతచెప్పిన వినడం లేదు. పైగా తాను డబ్బులు ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులను బెదిరించాడు.

భర్త్ డే పార్టీ కోసం డబ్బుల డిమాండ్..

భర్త్ డే పార్టీ కోసం డబ్బుల డిమాండ్..


అయితే డబ్బులు లేవని ఎంత చెప్పిన కొడుకు వినక పోవడంతో తల్లిదండ్రులు విసుగు చెందారు. తమ కళ్ల ముందే కోడుకు చనిపోవడం ఏందుకనుకోవడంతోపాటు , కుమారుడి వేధింపులతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఆవేశంలో కోడుకు ముందే తామే చనిపోతామంటూ ప్రసాద్ తెచ్చిన పెట్రోల్ బాటిల్‌ను తీసుకుని భార్యభర్తల ఒంటిపై పోసుకున్నారు.

పెట్రోల్ పోసుకున్న పేరెంట్స్‌కు నిప్పు

పెట్రోల్ పోసుకున్న పేరెంట్స్‌కు నిప్పు


అయితే ఇది గమనిస్తూనే ఉన్న ప్రసాద్ మనస్సు మాత్రం చలించలేదు. పైగా మీరు చనిపోతారా అయితే చనిపోండి అంటూ.. తన దగ్గర ఉన్న అగ్గిపుల్లను గీసీ తల్లిదండ్రులపైనే వేశాడు .దీంతో తల్లిదండ్రులకు తీవ్రగాయాలు కావడంతో అక్కడ ఉన్న ప్రసాద్ అమ్మమ్మ కేకలు వేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే ఇది చూసిన ప్రసాద్ అక్కడి నుండి పారిపోయాడు.

నిప్పుపెట్టి పారిపోయిన కిరతక కొడుకు

నిప్పుపెట్టి పారిపోయిన కిరతక కొడుకు


గాయపడ్డ ప్రసాద్ తల్లిదండ్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు ప్రసాద్ అమ్మమ్మకు కూడ గాయాలు కావడంతో ఆమేను సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొంతమంది ప్రసాద్ బంధువులు ఆయన్ని సమర్ధించడం కొసమెరుపు. తల్లిదండ్రులు ఆర్ధిక పరిస్థితులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+