ప్రేమపెళ్లికి నిరాకరణ: బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
వరంగల్: ప్రేమపెళ్లికి పెద్దలు నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెంది ఓ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నగరంలోని 6వ డివిజన్ అబ్బనికుంటలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... అబ్బనికుంటకు చెందిన ఎండీ యాకూబ్-సలీమ దంపతుల కూతురు రేష్మ సుల్తానా, అదే వీధికి చెందిన భగవత్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో పాటు తరచూ ఇరు కుటుంబాల పెద్దలు గొడవలకు పాల్పడుతున్నారు. గురువారం సాయంత్రం భగవత్ తల్లి భాగ్య, సోదరుడు ప్రణయ్ రేష్మసుల్తానా ఇంటి వద్దకు వచ్చి భగవత్‌ను ఎందుకు ప్రేమిస్తున్నావంటూ గొడవ చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన రేష్మ శుక్రవారం ఉదయం అబ్బనికుంట సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని భగవత్ ఇంటి వద్ద ఆందోళనకు సిద్ధం కాగా, ఇంటికి తాళం వేసి పరారయ్యారు.

మిల్స్‌కాలనీ సీఐ కె సత్యనారాయణ నేతృత్వంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అబ్బనికుంటలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. రేష్మ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కౌలు రౌతు ఆత్మ
గిరిజన కౌలు రైతు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కురవి మండలం తట్టుపల్లి శివారులోని చంద్యాతాండాల శుక్రవారం రాత్రి జరిగింది. పంట సాగు కోసం భూక్య బీముడు(45) 4 లక్షలు అప్పుతీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో తల్లిని డబ్బు అడిగాడు. ఆమె తన వద్ద లేవని చెప్పడంతో చేసేదేమి లేక ఇంట్లోకి వెళి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications