ఫెయిల్ చేస్తానని.. ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ రేప్

ప్రకాశం: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ గురువు వక్ర బుద్ధితో తన విద్య నేర్చుకుంటున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం మండలంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. నిందిత లెక్చరర్.. ఇంటర్ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థిని నిరాకరించడంతో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించి తన గదికి తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దాంతో ఆమె తనను పెళ్లిచేసుకోవాలంటూ లెక్చరర్‌ను నిలదీసింది.

A student allegedly raped by lecturer

అందుకు మొదట్లో పెళ్లికి సరేనన్నా.. చివరకు ఆ లెక్చరర్ మోహం చాటేశాడు.. అతడి మాటలు నమ్మిన విద్యార్థిని చివరకు మోసపోయానని తెలుసుకుంది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది.

కీచక లెక్చరర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితురాలు వాపోయింది. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు లెక్చరర్‌ను అరెస్ట్ చేయలేదంటూ విద్యార్థినీ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+