నిమజ్జనంలో అపశృతి: అశ్లీల నృత్యాలు, జీపు ధ్వంసం
నెల్లూరు/విశాఖ: నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నానదిలో మంగళవారం రాత్రి గల్లంతైన ఎఎన్ పేట మండలం కొండమీదకొండూరు గ్రామానికి చెందిన రవికుమార్ మృతి చెందాడు. వినాయకుడి విగ్రహాన్ని పెన్నానదిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.
అర్ధరాత్రి నుంచి జాలర్లు గాలించి బుధవారం ఉదయం రవికుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. రవికుమార్ ఆత్మకూరులో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

నిమజ్జన వేడుకల్లో అశ్లీల నృత్యాలు
విశాఖపట్నం: జిల్లాలోని చీడికాడ మండలం బైలపూడిలో జరుగుతున్న వినాయక నిమజ్జన వేడుకల్లో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. అశ్లీల నృత్యాలను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులతో నిర్వాహకులు గొడవకు దిగారు. వారితో ఘర్షణపడి పోలీసుల జీపును ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications