ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో ఇరుక్కున్న యువతి: గంటన్నరపాటు నరకం (వీడియో)
విశాఖపట్నం: దువ్వాడ రైల్వే స్టేషన్లో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ విద్యార్థిని రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. అన్నవరం నుంచి దువ్వాడ వచ్చిన ఆమె.. రైలు దిగుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు గంటన్నరపాటు యువతి రైలు, ప్లాట్‌ఫాం మధ్యనే నరకయాతన అనుభవించారు.
చివరికి గంటన్నరపాటు శ్రమించిన రైల్వే సిబ్బంది.. యువతిని బయటకు తీశారు. ప్లాట్ ఫాం పగలగొట్టిన సిబ్బంది.. యువతిని సురక్షితంగా బయటకు తీయడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.

అనంతరం రెస్క్యూ బృందం ఆ యువతిని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని దువ్వాడ కాలేజీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోందని, ఆమె అన్నవరానికి చెందిన శశికళగా గుర్తించారు. ప్రస్తుతం యువతి క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Hyderabad: Rescue workers saved a 20-yr-old student after she was stuck in the gap between platform & a train at Duvvada railway station in Visakhapatnam district. pic.twitter.com/CWX5hSrVC8
— dayakrishan (@dayakrishan3) December 7, 2022
రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రయాణికులు జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. కాగా, యువతిని కాపాడిన రైల్వే సిబ్బందికి నలువైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications