జగన్ ప్రభుత్వంలో సర్పంచులకు కట్టుకున్న పంచెలు కూడా మిగల్లేదు

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచులు, ఎంపీటీసీలు సంబరాలు చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్ లుగా గెలిచిన మమ్మల్ని అప్పటి ప్రభుత్వ పెద్దలు కనీసం మమ్మల్ని మనుషులు లాగా కూడా గుర్తించలేదని సర్పంచుల ఆరోపిస్తున్నారు. సర్పంచులకు వాళ్లు కట్టుకున్న పంచెలు కూడా మిగల్లేదని, జగన్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి నిధులు కూడా చేతికి అందలేదని సర్పంచులు ఆరోపించారు.

జగన్ ప్రభుత్వంలో మా చేతికి నిధులు రాలేదని ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచులు సంఘం ఆరోపించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు రూ. 38 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. కేంద్రం 15వ ఆర్థిక సంఘం ఈ నిధులు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వంలో 15వ ఆర్థిక సంఘం నిధులకు భారీగా కోతలు పడేవని, విద్యుత్ బిల్లుల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చిన నిధులు తీసుకుందని, సర్పంచులకు నిధులు ఇవ్వడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచులు ఆరోపించారు.

A sum of Rs 39 crore has been sanctioned for the joint Anantapur district

గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు విడుదల కాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్ ఆరోపించారు. ఆ సమయంలో గల్లి నుండి ఢిల్లీ వరకు ఆందోళనలు, ధర్నాలు చేసిన సర్పంచులు వారి సొంత ఖర్చులతో ఇంతకాలం వారి గ్రామాల్లో తాగునీటి సదుపాయాలు, రోడ్ల మరమ్మతులు చేయించారని గోనుగుంట్ల భూషణ్ అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులు ఎంత ఆందోళన చేసినా అప్పుడు జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం నిధులు విడుదల చేస్తామని ఒక్క మాట కూడా మాకు చెప్పలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, ఎంపీటీసీలు పంచాయతీల్లో చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు రాలేదని గోనుగుంట్ల భూషణ్ ఆరోపించారు.

జగన్ ప్రభుత్వ హయాంలో చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని గోనుగుంట్ల భూషణ్ ఆరోపించారు ఎట్టకేలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని గోనుగుంట్ల భూషణ్ అన్నారు. అనంతపురం జిల్లాలో 575 పంచాయతీలు, శ్రీసత్య సాయి జిల్లాలో 465 పంచాయతీలు ఉన్నాయి అనంతపురం జిల్లా కి రూ. 20 కోట్లు శ్రీ సత్యసాయి జిల్లా కి రూ. 17.96 కోట్లు నిధులు మంజూరు కావడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+