ఎన్నారై మహిళకు వేధింపులు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్
గత కొన్ని రోజులుగా తనను వేధింపులకు గురిచేయడంతో ఓ ఎన్నారై మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ: గత కొన్ని రోజులుగా తనను వేధింపులకు గురిచేయడంతో ఓ ఎన్నారై మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను వేధింపులకు గురిచేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత అక్కినేమి లోకేశ్వరరావు తనయుడు విజయకృష్ణ గత కొన్ని రోజులుగా ఓ ఎన్నారై మహిళను వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో బాధిత మహిళ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పెనమలూరు పోలీసులు.. విజయకృష్ణను గురువారం అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications