ప్రేయసికి గుండు చేసిన ప్రియుడు: టీచర్ వేధింపులు

Krishna District
విజయవాడ/విశాఖ: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి మంచి మార్గంలో నడిచేలా చేయాల్సిన పాఠశాల ఉపాధ్యాయుడే తప్పుడు పనులు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహానికి గురయ్యాడు. కృష్ణా జిల్లాలోని నందిగామ మండలం అనాసాగరం పాఠశాలలో లెక్కల టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు తరగతి గదిలోనే బూతులు మాట్లాడటమే కాకుండా.. విద్యార్థినీ, విద్యార్థుల ముందు ద్వంద్వర్థాలు మాట్లాడుతూ, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో అసహనానికి గురైన బాలికలు టీచర్‌పై వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఆగ్రహానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళనకు దిగారు. బాలికలపై వేధింపులకు పాల్పడున్న ఆ ఉపాధ్యాయుడ్ని వెంటనే పాఠశాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఘటనపై విచారణ జరిపించి, తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

ప్రేయసికి శిరోముండనం చేసిన ప్రియుడు

విశాఖ: తన ప్రేయసి పట్ల ప్రియుడే దారుణంగా వ్యవహరించి శిరోముండనం చేసిన ఘటన విశాఖపట్నం జిల్లాలోని బంగారమ్మపేటలో జరిగింది. డబ్బు తీసుకురావాలని తన ప్రేయసిని వేధింపులకు గురి చేసినా అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను బంధించి శిరోముండనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తమను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.

పోలీసులు చెప్పిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. బంగారమ్మపేట పంచాయతీ గుజ్జువానిపాలేనికి చెందిన లోవ దుర్గ, శరభన్నపాలేనికి చెందిన సంపర బాలకుమార్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ శరభన్నపాలెంలో సహజీవనం చేస్తూ జీవిస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా బాలకుమార్ తరచూ డబ్బులు తెమ్మని దుర్గను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో దుర్గ.. గ్రామ సర్పంచ్ దగ్గరకు ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో బాలకుమార్‌ను పిలిపించి మంచిగా నడుచుకోవాలని చెప్పాడు. ఈ విషయమై దుర్గ, బాల కుమార్ మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలకుమార్.. దుర్గ కాళ్లు, చేతులు కట్టేసి ఆమెకు శిరోముండనం చేశాడునానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+