టీటీడీ ఈఓ చేతికి ఆ నివేదిక- భక్తులకు మరింత మెరుగ్గా..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 64,861 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,639 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.65 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో వేచివుండనక్కర్లేదు. క్యూలైన్ల ద్వారా నేరుగా దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

A team of Satya Sai Seva Organisation explained to EO the core observations

కాగా- శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత బాధ్యతగా సేవలను అందించడానికి శ్రీసత్యసాయి సేవా సంస్థలకు చెందిన నలుగురు సభ్యుల బృందం ఓ సమగ్ర నివేదికను రూపొందించింది. ఈ బృందం టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావుకు నివేదికను అందించింది.

శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి, దేశంలో పేరొందిన ఆధ్యాత్మిక సంస్థల నిర్వహణా పరమైన సూచనలు, సలహాలను తీసుకుని అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు శ్రీసత్యసాయి సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు చుండూరి సురేంద్ర, రాష్ట్ర సేవా సమన్వయకర్త కొమరగిరి శ్యామ్ ప్రసాద్, జాయింట్ సేవా సమన్వయకర్త చెవిటి విశ్వనాథ రెడ్డితో ఈ టీమ్‌ నియామకమైంది.

ఫిబ్రవరి 28 నుండి 5 రోజుల పాటు తిరుమలలో క్షేత్రస్థాయిలో శాఖలు, విభాగాల వారీగా పరిశీలించి నివేదికను తయారు చేశారు. దీన్ని శ్యామలరావుకు అందించారు. నివేదికలో సేవకులకు మాస్టర్స్ ద్వారా ట్రైనింగ్, సులభతరంగా రిజిస్ట్రేషన్, క్షేత్రస్థాయిలో శిక్షణ, గ్రామ స్థాయిలో ధర్మ ప్రచారానికి సేవకులతో సమన్వయం వంటి అంశాలు ఉన్నాయి.

వీటితో పాటు శాఖల వారీగా చేపట్టాల్సిన అంశాలను, సౌకర్యాలను నివేదిక రూపంలో ఈవోకు అందించారు. ఏడు పేజీల నివేదిక ఇచ్చిన ప్రతినిధులను ఈ సందర్భంగా ఈవో అభినందించారు. భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపర్చడానికి ఉపయోగకరంగా ఉందని ప్రశంసించారు. ఈ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోవాలని సీపీఆర్వో డాక్టర్ టీ రవిని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+