వైసీపీ నాయకుల అరాచకం, టీడీపీ లీడర్ సజీవదహనం, పెట్రోల్!!

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురైనాడు. వైసీపీ కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారని తెగ బాధ పడిపోతున్న వైసీపీ నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు హత్య విషయంలో నోరు విప్పడం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. నిద్రపోతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టి అతి దారుణంగా హత్య చేశారు.

వైసీపీకి చెందిన నాయకులు టీడీపీ నాయకుడిని హత్య చేశారని హత్యకు గురైన యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లాలోని చిల్లకూరు మండలంలోని నాంచారంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుడు హరిప్రసాద్ నివాసం ఉంటున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో హరి ప్రసాద్ చాలా చురుకుగా పాల్గొంటున్నాడు. సోమవారం రాత్రి సమీప బంధువు కాటయ్యతో కలిసి హరిప్రసాద్ ఇంటి నుండి బయటకు వెళ్ళాడు.

A Telugu Desam Party leader was killed by pouring petrol on his house in Tirupati district

కొన్ని గంటల తర్వాత హరి ప్రసాద్ అతని బంధువు కాటయ్య ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. మంగళవారం వేకువజామున కాటయ్య ఇంటిలో హరి ప్రసాద్ నిద్రపోతున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు అక్కడికి వెళ్లారు. ఆ తరువాత కాటయ్య ఇంటిలో నిద్రపోతున్న హరిప్రసాద్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు వ్యాపించడంతో హరిప్రసాద్ ఇంట్లో నుండి బయటకు రాలేక కేకలు వేశాడు.

తీవ్రగాయాలైన హరిప్రసాద్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న హరిప్రసాద్ కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నాయకుడు కట్టా రామచంద్రారెడ్డి, మధుతో పాటు కొందరు వ్యక్తులు హరి ప్రసాద్ మీద పెట్రోల్ పోసి నిప్పుంటించి చంపేశారని బాధితుడు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

A Telugu Desam Party leader was killed by pouring petrol on his house in Tirupati district

కేసు నమోదు చేసిన పోలీసులు కట్టా రామచంద్రారెడ్డితో పాటు అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు హత్య గురవుతున్నారని ఇంతకాలం వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిని అతి దారుణంగా హత్య చేస్తే వైసీపీ నాయకులు నోరు విప్పడంలేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+