TTD: రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం, ఒకే రోజులో- ఇక నుంచి..!!

Tirumala: తిరుమలలో వేసవి రద్దీ క్రమేణా పెరుగుతోంది. ఈ నెలలో రద్దీ ఎక్కువగా ఉంటుంద ని తొలుత అంచనా వేసినా.. ఆశించిన స్థాయిలో రద్దీ కనిపించ లేదు. కాగా, గత వారం నుంచి రద్దీ పెరుగుతోంది. అందులో భాగంగా రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం దక్కింది. ఇక.. టీటీడీ భక్తుల ఏర్పాట్ల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఈవో, ఏఈవో భక్తులకు అందుతున్న సదుపాయా పైన తనిఖీలు చేసారు. కీలక ఆదేశాలు ఇచ్చారు.

దర్శనంలో కొత్త రికార్డు
ఈ ఏడాది వేసవిలో రద్దీ క్రమేణా పెరుగుతోంది. తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సాధారణంగా రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది. కాగా, ప్రతీ గురువారం సాధారణంగా కేవలం 62 నుండి 63 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే నిన్న (గురువారం) అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి నేతృత్వంలో, తిరుమలలోని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. దీంతో, తొలిసారి గురువారం నాడు 72,579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు.

a-total-of-72-579-devotees-had-darshan-of-sri-venkateswara-swamy-in-single-day

ఈవో తనిఖీలు
ఇంత పెద్ద మొత్తంలో భక్తులకు దర్శనం దక్కటం పైన అదనపు ఈవో విశేష కృషి చేసిన అన్ని విభాగాల సిబ్బందిని అభినందించారు. ఇక.. టిటిడి ఈఓ శ్యామలారావు తిరుమలలోని సహజ శిలా తోరణం మరియు చక్ర తీర్థాన్ని గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తన తనిఖీలో భాగంగా ఈ ప్రాంతాలలో పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. తరువాత చక్ర తీర్థం రాతి కొండలో చెక్కి ఉన్న శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలను మరియు అక్కడే ఉన్న శ్రీ శివుని సాన్నిధ్యాన్ని కూడా పరిశీలించారు. టీటీడీ అధికారులకు ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగుపరచాలని ఈవో ఆదేశించారు. అదనపు ఈవో ద‌ర్శ‌ క్యూలైన్ల‌లో ఆకస్మిక త‌నిఖీలు నిర్వహించారు.

సేవలపై సూచనలు
తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో టీటీడీ అద‌న‌పు ఈవో వెంకయ్య చౌద‌రి ఈ రోజు వేకువ జామున ద‌ర్శన క్యూలైన్ల‌లో ఆకస్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. కృష్ణ‌తేజ విశ్రాంతి భ‌వ‌నం వ‌ద్ద క్యూలైన్ల‌లో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీటిపై ఆరా తీసి టీటీడీ క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌పై భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాం ఇబ్బంది క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇక.. భక్తులకు తిరుమలలో ఏఐ ఆధారిత సేవలు అందించేందుకు టీటీడీ కొత్త టెండర్లు ఆహ్వానించింది. దీని ద్వారా ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వటంతో పాటుగా శీఘ్రంగా దర్శనం.. వసతి.. సేవలు అందించేలా కార్యచరణ సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+