జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని నిగ్గ‌దీసి అడుగుతున్న ఓ సామాన్యుడు..!! నెట్టింట హ‌ల్‌చ‌ల్‌(వీడియో)

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించి రెండు నెల‌లు పూర్త‌యింది. అయితే, అప్పుడే కొంద‌రు త‌మ ప్రాంతా న్ని విస్మ‌రిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ బాధ‌ను వీడియో రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తు న్నారు. తాజాగా అమరావ‌తి ప్రాంతానికి చెందిన వారిగా భావిస్తున్న ఓ వ్య‌క్తి త‌న భావోద్వేగాన్ని క‌విత రూపంలో చెబుతూ ప్ర‌భుత్వం మీద అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప్ర‌ధానంగా క‌ల‌ల రాజ‌ధాని ఏమైంద‌న్న‌ది అత‌డి ప్ర‌శ్న‌.

సామాన్యుడి భావోద్వేగం...

ఇది ఒక సామాన్యుడి భావోద్వేగంతో కూడిన ఈ వీడియోలో రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల పైన ప్ర‌స్తావ‌న ఉంది. అసెంబ్లీ చుట్టూ అట‌వీ త‌మ్మలు పెంచార‌ని..అమ‌రావ‌తిని అట‌కెక్కించార‌ని క‌విత రూపంలో ఆవేద‌న వ్య‌క్తం చేసారు. అదే స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వాలే క‌క్ష్య సాధిస్తూ నీవు ఇక్క‌డికి వ‌చ్చేవాడివా..బ‌తికి బ‌ట్ట‌క‌ట్టేవాడివా అంటూ ఆ వ్య‌క్తి నిల‌దీస్తున్నాడు. పోల‌వ రానికి పాడె కట్టి..అభివృద్దిని ప‌క్క‌న పెట్టార‌ని పేర్కొన్నారు. జ‌న జీవ‌నంలో ఈ క‌న్నీరేంటి అని నిల‌దీస్తున్నారు.

జ‌గ‌న్ పాల‌న మూడు నాళ్ల ముచ్చ‌ట అంటూ ..

జ‌గ‌న్ పాల‌న మూడు నాళ్ల ముచ్చ‌ట అంటూ ..

ఆంక్ష‌ల పై..అవ‌మానాల పై..అహంకారం పై..అవ‌రోధాల పై..అధికారం పై..ఆస్తిత్వానికై..ఆత్మ గౌర‌వానికై పోరాడుతామ‌ని.. నిర్బంధాల‌ను స‌హించ‌బోమంటూ ఆ వీడియోలో ఉన్న వ్య‌క్తం చాలా ఆవేశంగా చెప్పుకొచ్చారు. ప‌రోక్షంగా జ‌గ‌న్ పాల‌న మూడు నాళ్ల ముచ్చ‌ట అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు ఈ వ్య‌క్తి ఎవ‌రు..ఎందుకింత ఆవేశంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న పైన అంత ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడ‌నేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆ వ్య‌క్తి చెప్పిన విష‌యాలు చూస్తూ అమ‌రావ‌తి ప్రాంతానికి చెందిన వ్య‌క్తిగా భావిస్తున్నారు.

Recommended Video

    జీతాలు చెల్లించాలంటూ కార్మికుల ధర్నా...
    టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లా..వ్య‌క్తిగ‌త ఆవేద‌నా..

    టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లా..వ్య‌క్తిగ‌త ఆవేద‌నా..

    ఈ వీడియోలో ఆ వ్య‌క్తం చెబుతున్న విష‌యాలు..పేరు చెప్ప‌క‌పోయినా ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు గా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే రాజ‌ధాని..పోల‌వ‌రం..గోదావ‌రి నీటి గురించి చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే అవి టీడీపీ చేసిన ఆరోఫ‌ణ‌ల‌కు ప్ర‌భావితం అయి చేసిన ఆరోప‌ణ‌లుగా క‌నిపిస్తున్నాయి. అదే విధంగా అసెంబ్లీ చుట్టూ త‌మ్మ చెట్లు వ‌చ్చాయ‌ని చెప్పుకొచ్చారు. చాల క‌సిగా..ఆవేశంతో ప్ర‌భుత్వం పైన ఆ వ్య‌క్తి త‌న ప్రాస‌..యాస‌తో రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మ‌రి..దీని పైన వైసీపీ శ్రేణులు ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+