పట్టపగలు.. రోడ్డుపై.. ఇదే రోగం బాబు..! వైరల్ అయిన అమ్మాయి, అబ్బాయి వీడియో..
ప్రస్తుత సమాజంలో యువతలో కొంద మంది పెడదారి పడుతున్నారు. యువతే కాదు పిల్లలు కూడా పెడదారి పడుతున్నారు. తాజాగా మైనర్ బాలుడు, బాలికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన విశాఖలో జరిగింది.
ఈ వీడియోలో బాలుడు బైక్ నడుపుతుండగా అతనికి ఎదురుగా ఆయిల్ ట్యాంక్‌పై బాలిక అసభ్యకరంగా కూర్చుంది. అతను అలానే రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లారు. వీరిద్దరిని వెనకాలే వస్తున్న వారు వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.

ఇదంతా చూసిన నెటిజన్లు కలికాలమంటన్నారు. ఈ ఘటనకు సంబంధించి విశాఖ నగర పోలీసు కమిషనరు శ్రీకాంత్ సీరియస్ అయ్యారు. సామాజిక మాద్యమంలో వైరల్ గా మారిన వీడియో కు స్పందించిన సీపీ శ్రీకాంత్ వారిని గుర్తించి తక్షణం అదుపులోకి తీసుకోవాలని సిబ్బందికి అదేశించారు.
విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగింపు. హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి నివ్వెరపోయిన స్థానికులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/i2dGgHKElg
— Vizag News Man (@VizagNewsman) December 29, 2022
అనకాపల్లి జిల్లా చోడవరం కు చెందిన బాలుడు కాటపాడు బాలికగా పొలీసులు గుర్తించారు. వీడియో ఆధారంగా ఇద్దరు విద్యార్థులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసిన పొలీసులు ఇరువురి తల్లిదండ్రులకు పొలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications