నిజమేనా?: పవన్ 'సీక్రెట్స్'పై ఓ వీఐపీ ఫోకస్.. ఏం చేయబోతున్నాడు?
హైదరాబాద్: గతంలో పవన్ పలుకుబడిని ఉపయోగించుకుని ఎంపీ టికెట్ సంపాదించాలనుకున్న ఓ వీఐపీ.. ఆ ప్రయత్నాలేవి కుదరకపోవడంతో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగాలని చూస్తున్నాడట. ఇందుకోసం పవన్ బలహీనతలపై గట్టిగానే ఫోకస్ చేశాడట. పవన్ వీక్ పాయింట్ కు సంబంధించి ఏ చిన్న క్లూ దొరికినా సరే.. దాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలనే ఎత్తుగడ వేస్తున్నాడట.

రాజకీయ లబ్ది కోసమేనట..:
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓ వీఐపీ పవన్ ద్వారా ఎంపీ టికెట్ సాధించేందుకు విఫలయత్నం చేశారు. అప్పట్లో పవన్ సభలు, సమావేశాలకు సదరు వీఐపీ ఆర్థికంగానూ అండదండలు అందించారన్న ఊహాగానాలు వినిపించాయి. పవన్ వల్ల రాజకీయ లబ్ది చేకూరుతుందనే ఉద్దేశంతోనే అవన్నీ చేసినప్పటికీ.. ఆశించనదేది దక్కకపోవడంతో ఇప్పుడు తన స్ట్రాటజీ మార్చుకున్నాడట సదరు వీఐపీ.

వీక్ పాయింట్ దొరికితే..:
బతిమాలితేనో.. పదేపదే విన్నవించుకుంటేనో పని కాదనుకున్న ఆ వీఐపీ.. పవన్ బలహీనతతోనే ఆయన్ను దిగొచ్చేలా చేయాలనుకుంటున్నాడట. పవన్‌కు సంబంధించి ఏదైనా వీక్ పాయింట్ దొరికితే.. దాన్ని అడ్డుపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారట. ఈ క్రమంలో.. మొన్నామధ్య పవన్ పై వినిపించిన కొన్ని ఆరోపణల మీద సదరు వీఐపీ సీరియస్ గా ఫోకస్ పెట్టాడట.

'సీక్రెట్స్'పై ఫోకస్..:
పవన్ కల్యాణ్ అభిమానులకు, ఆయన వ్యతిరేకులకు మధ్య నడిచిన వివాదంలో.. జనసేనానిపై కొన్ని సంచలన ఆరోపణలు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఓ హీరోయిన్ పేరు కూడా తెర పైకి రావడం.. వారితో సంబంధాలపై ప్రచారం జరగడం అందరికీ తెలిసిందే.
సరిగ్గా ఇప్పుడిదే పాయింట్‌పై ఫోకస్ చేసిన సదరు వీఐపీ.. అవసరమైతే ఆమె నుంచి వివరాలు లాగాలని చూస్తున్నారట. ఆమె అడిగినంత ముట్టజెప్పి ఆ ఆధారాలను సంపాదించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారట.

పవన్ మాత్రం ఊరుకుంటారా?
ఆ ఆధారాలు గనుక చేతికి చిక్కితే.. వాటితో పవన్ కల్యాణ్‌ను ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేయాలనేది సదరు వీఐపీ ప్లాన్ అన్న ప్రచారం జరుగుతోంది.
వాటిని అడ్డుపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కొట్టాలని చూస్తున్నాడట. అయితే ఈ ఊహాగానాల వెనుక నిజానిజాలెంతన్నది మాత్రం చెప్పడం కష్టమే. ఒకవేళ సదరు వీఐపీ అంత పని చేస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం చూస్తూ ఊరుకుంటారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.












Click it and Unblock the Notifications