చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలెక్టరేట్ ఆవరణలో కిరోసిన్ పోసుకుని మహిళ సజీవదహనం

కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఓమహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానిక కలెక్టర్ కార్యాలయం వెనుక గేటు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది .

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఓమహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానిక కలెక్టర్ కార్యాలయం వెనుక గేటు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది .అందరూ చూస్తుండగానే 90% కాలిపోయింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికి పూర్తిగా కాలిపోయింది. అయితే కలెక్టర్ కార్యాలయం వెనుక ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడింది అనేది పోలీసులకు మిస్టరీగా మారింది. 90%కాలిపోయిన ఈ మహిళ కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఎటువంటి ఆధారాలు దొరకక పోవటంతో మహిళ మృత దేహాన్ని స్థానిక మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

A woman allegedly burnt herself at collectorate office

దారుణం: మరుగుదొడ్డిలో 'పురిటి బిడ్డ'

తిరుపతి : పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో దారుణం చోటుచేసుకుంది. పురిటి బిడ్డను అత్యంత దారుణంగా మరుగుదొడ్డి బేసిన్‌లో దూర్చేశారు. శిశువు తల పట్టకపోవడంతో అలాగే వదిలి వెళ్లారు.. ఈ హృదయ విదారక సంఘటన మంగళవారం తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండులోని మరుగుదొడ్డికి వెళ్లిన భక్తులకు టాయిలెట్‌లో మృతిచెంది ఉన్న పురిటి బిడ్డ తల కనిపించింది. దీంతో కంగారుపడ్డ భక్తులు కేకలు వేసుకుంటూ బయటకొచ్చారు. విషయాన్ని భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం పారిశుద్ధ్య కార్మికులు వచ్చి టాయిలెట్‌లోని మృత శిశువును బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన భక్తులు చలించిపోయారు. అనంతరం శిశువు మృతదేహాన్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరుగుదొడ్డిలో పురిటి బిడ్డ మృతిపై తిరుమల పోలీసులు విచారణ చేపట్టారు.

English summary
A woman allegedly burnt herself at collectorate office in Kakinada on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X