దారుణం: కట్నం కోసం కోడలితో వ్యభిచారం చేయించే యత్నం
చిత్తూరు: కోడలును తల్లిలా ఆదరించాల్సిన ఓ అత్త ఆమె పాలిట రాక్షసిలా వ్యవహరించింది. కట్నం కోసం కొడుకు భార్య అని కూడా చూడకుండా ఆమెతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించింది. మానవత్వానికి మాయని మచ్చలాంటి ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది.
బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కట్నం తక్కువగా ఇచ్చారనే కారణంతో బాధితురాలిపై అత్త తరచూ వేధింపులకు పాల్పడేది. ఈ క్రమంలో పది రోజుల క్రితం వన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను అత్త తమ ఇంటికి తీసుకుని వచ్చింది. డబ్బు వస్తుందనే ఉద్దేశంతో అతని కోరిక తీర్చాలని కోడలిపై ఒత్తిడి తీసుకొచ్చింది.

అందుకు అంగీకరించని కోడలు.. దూషించడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు కానిస్టేబుల్. అయితే మరుసటి రోజు అతడ్ని ఇంటికి తీసుకొచ్చిన అత్త, అతడ్ని ఇంట్లోకి పంపించి బయటికి తాళం వేసింది. అప్పుడు కూడా అతని బారి నుంచి బాధితురాలు తప్పించుకుంది. ఆ తర్వాత రెండు రోజులకు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని లేదంటే నీ కొడుకును చంపేస్తానని బాధితురాలిని బెదిరింపులకు గురిచేశాడు.
ఆమె లొంగకపోవడంతో ఏప్రిల్ 11న బాధితురాలి కొడుకుకు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పింది. ఆస్పత్రిలో చేర్పించామని, వెంటనే రావాలని బాధితురాలిని తనవెంట తీసుకెళ్లింది అత్త. ఆస్పత్రికని లాడ్జీకి తీసుకెళ్లడంతో అత్తతో గొడవపడింది బాధితురాలు. కాగా, బలవంతంగా లాడ్జీలోకి తీసుకెళ్లి కానిస్టేబుల్ ఉన్న గదిలోకి తోసేసి బయటికి వచ్చేసింది.
కాగా, అత్యాచార యత్నానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ బారినుంచి మరోసారి తప్పించుుకున్న బాధితురాలు, నేరుగా తన పుట్టింటికి వెళ్లింది. కుటుంబసభ్యులకు జరిగిన విషయం చెప్పి, తన తల్లి, సోదరుడి సాయంతో ఆమె శుక్రవారం డిఎస్పీకి ఫిర్యాదు చేసింది.
డిఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications