అక్రమ సంబంధం: ఉద్యోగం కోసం భర్తను హత్య చేయించిన భార్య

ప్రకాశం: జిల్లాలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. భర్త చేసే ఉద్యోగం వస్తుందనే దురాశతో అతడ్ని కట్టుకున్న భార్యే హత్య చేయించింది. ఓ హత్యకేసు విచారణ జరుపుతున్న సమయంలో ఈ హత్య కేసు బయటపడినట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం డిఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు.

బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2009 ఆగస్టు 9న ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెద్దారవీడు గ్రామానికి చెందిన కె శంకర్ అనే సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ నంద్యాల ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తుండేవాడని, ఈ సమయంలో పఠాన్ సుభానితో మృతుని భార్య కె సుభాషిణికి అక్రమ సంబంధం ఏర్పడిందని తెలిపారు.

తరచూ ఇబ్బంది పెడుతున్న భర్తను అడ్డుతొలగించుకుంటే, భర్త ఉద్యోగంతోపాటు పెన్షన్ కూడా వస్తుందని భావించిన సుభాషిణి.. శంకర్ హత్యకు పథకం వేసినట్లు ఆయన తెలిపారు. అక్రమ సంబంధం పెట్టుకున్న పఠాన్ సుభానికి విషయం తెలిపిన సుభాషిణి, తన భర్తను చంపేందుకు 50వేల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చింది. దీంతో పఠాన్ సుభాని, అతని స్నేహితులైన తిరుమలశెట్టి వెంకటరమణ, కోలా రత్నకుమార్, షేక్ జాఫర్‌ను సంప్రదించి శంకర్ హత్యకు పథకం రచించారు.

A woman allegedly murdered her husband with paramour's help

ఈ నేపథ్యంలో పెద్దారవీడులో ఉన్న శంకర్‌కు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకొని దేవరాజుగట్టు ప్రాంతానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అతడ్ని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బొడుచర్ల-మిట్టమీదిపల్లి మధ్య రైల్వేపట్టాలపై వేసినట్లు డిఎస్పీ తెలిపారు. అప్పట్లో రైల్వేపోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదుచేశారని తెలిపారు.

కాగా, మార్కాపురం రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో బాబాయిని హత్యచేసిన కేసులో పఠాన్ సుభాని అలియాస్ గద్ద అలియాస్ గద్దగాడు నిందితుడిగా ఉండటంతో ఆ కేసు విచారణ జరుపుతుండగా ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చిందని డిఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు.

సుభాషిని భర్త మరణం ద్వారా వచ్చిన డబ్బులు, ఉద్యోగం చేసుకుంటూ కర్నూల్‌లో జీవనం సాగిస్తోంది. మొదటి నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్న పఠాన్ సుభానిని దూరంగా ఉంచడంతో ఈ హత్యకేసు విషయాన్ని పోలీసులకు తెలిపాడు సుభాని. దీంతో పెద్దారవీడు పోలీసులు శంకర్‌ను హత్య చేసిన నిందితులను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+