ఎంపిటిసిపై అత్యాచారయత్నం: మూగ బాలికపై రేప్

A woman MPTC alleged rape attempt by a man
విశాఖపట్నం: జిల్లాలోని జి మాడుగుల మండలం ఉర్లమిట్టలో ఎంపిటిసి సభ్యురాలిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న భర్తపై దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా జిల్లాలోని రోలుగుంట మండలంలో జరిగిన దారుణం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. మూగ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జెపి ఆగ్రహారం గ్రామానికి చెందిన 14ఏళ్ల మూగ బాలికపై అదే గ్రామానికి చెందిన దాసు అనే యువకుడు జులై 6న మాయమాటలు చెప్పి ఊరు బయట పొలాల్లోకి తీసుకెళ్లాడు.

మానసికంగా కూడా వికలాంగురాలైన బాలిక అతనితో వెళ్లింది. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు యువకుడు. బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు మంగళవారం నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్నీని ఆశ్రయించారు. కేసు విచారణ చేయాల్సింది కొత్తకోట సిఐ కృష్ణవర్మను ఏఎస్పి ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+