ఇంత దారుణమా?: ప్రభుత్వ ఉద్యోగం కొడుక్కి వస్తుందని భర్తను చంపేసింది

అనంతపురం: గుంతకల్లు పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే నెపంతో కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ ఇల్లాలు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేశారు.

ఆంధ్రాబ్యాంకు రోడ్డులో నివాసం ఉంటున్న సాల్మన్‌రాజును (45) ఆయన భార్య సరళకుమారి హత్యచేసినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. నిందితురాలిపై శనివారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ శాఖలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు సాల్మన్ రాజు.

గుంతకల్లు పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు రోడ్డులో నివాసముంటూ మండల కేంద్రమైన యాడికిలో విధులు నిర్వహిర్తించేవాడు. ఇతనికి భార్య ప్రేమలత, కుమారుడు(24), కుమార్తె స్వరూప(20) ఉన్నారు. తాగుడుకు బానిసైన సాల్మన్ రాజు విధుల్లో తనకు సహాయంగా కుమారుడిని వెంట తీసుకెళ్లేవాడు.

A woman murdered her husband

ఈ నేపథ్యంలో భర్తను చంపితే కుమారుడికి ఉద్యోగం వస్తుందని ప్రేమలత భావించింది. ఈ క్రమంలో గురువారం మద్యం మత్తులో ఉన్న భర్తను కుమారుడితో కలిసి చితకబాది కిందికి తోసింది. ఈ క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. మెట్లపై నుంచి కిందపడ్డాడని నాటకమాడి.. స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.

పరిస్థితి విషమించి సాల్మన్ రాజు శుక్రవారం ఉదయం మృతిచెందాడు. శనివారం ఉదయం మృతదేహాన్ని సంప్రదాయం ప్రకారం ప్రభాత్‌నగర్‌లోని సీఎస్ఐ చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేయించారు.

కాగా, అంతలో సాల్మన్ రాజు మృతిపై అనుమానాలున్నాయని ఆయన తరపు బంధువులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాల్మన్ రాజు భార్య, కుమారుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+