ఐదేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల యువకుడి అత్యాచార యత్నం...గ్రామస్థులచే దేహశుద్ది

అనంతపురం:ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన అనంతపురం జిల్లా కణేకల్లు పట్టణంలో చోటు చేసుకుంది.

గ్రామస్థుల కథనం ప్రకారం...కణేకల్లులోని ఉరవకొండ రోడ్డులో వెంకటేష్‌ అనే అవివాహిత యువకుడు నూతనంగా గృహాన్ని నిర్మిస్తున్నాడు. గృహ నిర్మాణ పనుల కోసమని కొంతకాలంగా ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్న వెంకటేష్ చుట్టుప్రక్కల చిన్నారులతో బాగా సఖ్యతగా ఉండేవాడు. వారికి చాక్లెట్లు ఇవ్వడంతో పాటు సెల్‌ఫోన్లో బొమ్మలు చూపిస్తూ, పాటలు వినిపిస్తూ మాలిమి చేసుకునేవాడు.

A Young man sexually abused five-year-old baby ...arrested

ఇదే క్రమంలో వెంకటేష్‌ ఆదివారం ఈ ప్రాంతానికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారిని తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పరిసరాల్లోని ముళ్ల కంపల వద్దకు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ సమయంలో వెంకటేష్ ప్రవర్తన చూసిన కొందరు యువకులు ఈ విషయాన్ని చిన్నారి తండ్రితో పాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. అంతేకాక వెంకటేష్ రోజూ అక్కడ మద్యం తాగుతాడనే విషయం కూడా తెలియచెప్పారు.

చిన్నారితో వెంకటేష్ అసభ్య ప్రవర్తన విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు వెంకటేష్‌ను చుట్టు ముట్టి నిలదీశారు. అయితే వెంకటేష్ వారిపై ఎదురు తిరిగేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహావేశానికి గురైన స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్‌ఐ రామారావు ప్రత్యక్ష సాక్ష్యులను, చిన్నారి తండ్రిను విచారించారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించగా చిన్నారి తండ్రి ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+