సెల్‌ఫోన్ కోసం స్నేహితుడిని చంపేసిన యువకుడు...
సెల్‌ఫోన్ కోసం స్నేహితుడినే చంపేసాడు ఓ యువకుడు. ఈ సంఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టిఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ కోసం గొడవ జరిగింది. చిన్నగొడవ కాస్త చిలికి చిలికి పెద్దగొడవకు చివరికి చంపుకునే వరకు దారితీసింది. ఆ గొడవలో ఒకరి ప్రాణం పోయింది. మద్యం సేవించిన ఆ యువకుడు సెల్‌ఫోన్ గొడవతో స్నేహితుడిన కడతేర్చేందుకు ప్రయత్నించాడు. అందుకోసం మరికొంతమంది స్నేహితులతో కలిసి ఆ యువకుడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కత్తితో పొడిచేసి చంపేసాడు.
ఫోన్ కోసం ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ : విజయవాడకు చెందిన స్వామి, శివ, కనక ఎంతో మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లాలన్న వీళ్లు ముగ్గురు కలిసే వెళ్లేవారు. కలిసే ఏ పనైనా చేసేవారు. బుధవారం ఉదయం కూడా వీరు ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. అయితే, తాగిన మత్తులో వున్న స్వామి తన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు తన సెల్‌ఫోన్ అమ్మిపెట్టమంటూ స్నేహితుడు కనకను పట్టుబట్టాడు. అయితే, అందుకు కనక నాకు రెండు రోజుల గడువివ్వు. అలోగా, నీ సెల్‌ఫోన్ కొనిపెట్టి ఎంతో కొంత డబ్బు నీకు ఇస్తాను అన్నాడు.

అందుకు స్వామి ఒప్పుకోలేదు. వెంటనే అమ్మేయాలంటూ కనకను బలవంత పెట్టాడు. దాంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. తాగినమైకంలో వున్నవీరిద్దరూ గొడవపడ్డం ప్రారంభించారు. అయితే, ఈ గొడవకు అసలు ఎలాంటి కారణం లేని శివ వీరిద్ద మధ్యలో తలదూర్చాడు. గొడవకు కారణమైన మొబైల్ తీసుకుని శివ నేలకేసి కొట్టాడు. దాంతో ఆ ఫోన్ కాస్త పగిలిపోయి అమ్మేందుకు పనికిరాకుండా పోయింది.
మరో ముగ్గురితో కలిసి శివను చంపేందుకు స్కెచ్ : దాంతో స్వామి శివపై కోపంతో రగిలిపోయాడు. నా ఫోన్‌నే పగలగొడతాడా అనుకుంటూ అతని మీద క్షక్ష్య పెట్టుకుంటాడు. ఆ కోపంలో ఇంటికి వెళ్లి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మళ్లీ మద్యం సేవిస్తాడు. దాంతో ఆ ముగ్గురు కలిసి శివను చంపాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో మందుతాగుదామని శివకు ఫోన్ చసి రమ్మంటారు. శివను పిలుచుకుని కృష్ణా నది వద్దకు తీసుకెళ్తాడు స్వామి. అప్పటికే అక్కడున్న మరో ఇద్దరితో కలిసి శివను కత్తితో పొడిచి అత్యంత క్రూరంగా చంపేస్తాడు స్వామి.
ఆ ప్రాంతమంతా రక్తసిక్తమవుతుంది. శివ మృతదేహం రక్తంతో నిండి ఉంటుంది. ఈ సంఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిస్తారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివను చంపింది స్వామి అని గుర్తించి, అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications