సోదరుడి శోభనం చూడాలని ఓ ఘనుడు ఏం చేశాడో తెలుసా..?
శోభనం రోజున చాలా మందిలో అనేక రకాల భావాలు కలగడం సహజం. ఇది ఒక కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భం కాబట్టి, కొంచెం ఆందోళన, ఉత్సాహం, భయంగా, ఆత్రుతగా ఉంటుంది. శోభనం రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే అతృత పెళ్లి కాని వారిలో కలగడం సహజం. అయితే ఓ ఘనుడు శోభనం గదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వినూత్నంగా ప్రయత్నించాడు. ఏకంగా శొభనం గదిలోకి దొంగలా దూరి చేయకూడని పని చేశాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..
నూతనంగా పెళ్లి చేసుకున్న జంటకు కుటుంబ సభ్యులు మొదటి రాత్రిని ఏర్పాటు చేశారు. మొదటి రాత్రి సహజంగానే ఎవరికైనా కాస్తా బెరుకుగా ఉంటుంది. ఆ భయంతోనే శోభనం గదిలోకి అడుగుపెట్టారు నూతన జంట. అయితే కార్యం ప్రారంభించడానికి ముందు నూతన దంపతులుకు తమ గదిలో ఎవరో ఉన్నారనే అనుమానం వచ్చింది. తీరా గది అంతా పరిశీలించగా, సన్‌సైడ్ మీద ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడని అర్థమయింది. వెంటనే అతన్ని బయటకు రావాలని హెచ్చరించారు. గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అతన్ని పట్టుకున్నారు.

లోపల ఏం చేస్తున్నావ్ అని అతన్ని ప్రశ్నించగా, శోభనం రోజున ఏం జరుగుతుందో తెలియదని, అందుకే దాని గురించి తెలుసుకోవాలని శోభనం గదిలోకి నూతన జంట రాకముందే , నేను శోభనం గదిలో దాక్కున్నానని అతను చెప్పుకొచ్చాడు. శోభనం గదిలోకి వెళ్ళి కెమెరాతో అటక మీద దాక్కుని రికార్డు చేయాలనుకున్నానని తెలిపాడు.అయితే రికార్డు చేయడానికి ముందే వారు కనిపెట్టడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇలా చేయడంతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫస్ట్ నైట్ రూమ్ లో దాక్కున్న వ్యక్తిని బయటకు లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అందరూ ఆ వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా పిచ్చి వేషాలు వేస్తూండటంతో.. చాలా మంది శోభనం గదిలోనే రీల్స్ చేసి పోస్టు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పిచ్చి మరింత ముదిరిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications