సినీ ఫక్కీలో పెళ్లి: పరిగెత్తుకు వెళ్లి తాళికట్టి, వధువును ముద్దాడిన వరుడు!
చిత్తూరు: సినిమాలో మాత్రమే జరిగే సన్నివేశాలు అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం తిరుమలలో ఓ పెళ్లి సినీ ఫక్కీలో జరిగింది.
ఆ వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా డక్కిలికి చెందిన జనార్దన్, సుమలతల వివాహాన్ని నిశ్చయించిన పెద్దలు తిరుమలలో పెళ్లి జరిపించేందుకు వచ్చారు.
అయితే, గతంలో జనార్దన్ తనను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని, ఆ తర్వాత తామిద్దరం ప్రేమించుకున్నామని, ఆపై తనను మోసం చేశాడని పద్మ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తిరుమలకు వచ్చి పెళ్లిని అడ్డుకున్నారు. జనార్దన్‌ను అరెస్ట్ చేసి కారులో తరలించేందుకు ప్రయత్నించగా.. సుమలత తరఫు బంధువులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
ఈలోగా కారు డోర్ తీసుకుని పరుగులు పెడుతూ జనార్దన్ కల్యాణ మండపం చేరుకుని వధువు సుమలత మెడలో మూడు ముళ్లు వేసి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
తనకు పద్మతో ఎలాంటి సంబంధం లేదని, ఆధారాలు లేకుండా ఎలా వస్తారని జనార్దన్ ప్రశ్నించారు. కాగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణను కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications