మద్యంపై ఆప్ పోరు (పిక్చర్స్): కల్లుపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కల్లు దుకాణాల ఏర్పాటుపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.
ఇదిలావుంటే, మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ఆబ్కారీ కమిషనరేట్ ముందు ధర్నాకు దిగారు. మద్యానికి బానిస కావద్దని, మద్యాన్ని రద్దు చేయాలని ఆప్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసేయాలని ఆప్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మానవ హక్కుల పరిరక్షణ, ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆ ధర్నా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మద్యం ఆరోగ్యానికి మంచిది కాదని కూడా వారు పోస్టర్లు ప్రదర్శించారు.

మద్యంపై పోరు
మద్యపాన నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ఆబ్కారీ కమిషనరేట్ ఎదురుగా ధర్నా చేశారు.

మద్యంపై పోరు
మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పోస్టర్లను, ప్లకార్డులను ప్రదర్సించారు.

మద్యంపై పోరు
తెలంగాణలో మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు శ్రీకారం చుట్టారు.

మద్యంపై పోరు
తెలంగాణ ఎక్సైజ్ కమిషనరేట్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మద్యం దుకాణాలు మూసేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications