పవన్ కల్యాణ్ ను కలిసిన వైసీపీ నాయకుడు
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. జనసేన పార్టీకి తన శక్తిమేరకు పనిచేస్తానని స్వాములు చెప్పినట్లు తెలుస్తోంది. మీలాంటి పెద్దలు జనసేనకు ఎంతో అవసరమని పవన్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఈ నెలాఖరులో స్వాములు వైసీపీని వీడి జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్ తోపాటు నాగబాబును కూడా స్వాములు కలిశారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు రాజేంద్ర కూడా ఉన్నారు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్వాములు ఫొటో కూడా ఉండటంతో కొద్దిరోజుల క్రితం ఈ వార్త వైరల్ గా మారింది. స్వాములు పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది.
ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు.

ఆమంచి కృష్ణమోహన్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి పోటీచేసి విజయాన్ని దక్కించుకున్నారు. తర్వాత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన కరణం బలరాం అనంతర పరిణామాల్లో వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో కరణం, ఆమంచి వర్గాల మధ్య పోరు నడిచింది. తర్వాత పర్చూరుకు ఇన్ ఛార్జిగా ఆమంచిని నియమించారు. స్వాములు తనతోపాటు తన కుమారుణ్ని కూడా తీసుకువెళ్లడంతో అతన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications