బాల భీముడు, వయస్సు 14 , బరువు 150 కిలోలు
అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని గోవిందరాయుని పేటకు చెందిన మహేష్ భూపతి వయస్సు 14. ఆయన బరువు మాత్రం 150 కిలోలు. మహేష్ ఆకలికి తట్టుకోలేడు. ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. అసాధారణంగా బరువు పెరుగుదలపై
శింగనమల :వయస్సుకు మించిన బరువు ఓ బాలుడిని ఇబ్బంది పెడుతోంది ఆకలికి తట్టుకోలేడు. అసలే తండ్రి లేడు. దీంతో ఆ బాలుడిని గ్రామస్థులంతా దత్తపుత్రుడిగా చూసుకొంటారు. అసాధారణంగా ఈ బాలుడు బరువు పెరగడంపై ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు.
అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని గోవిందరాయునిపేట గ్రామానికి చెందిన వడ్డే శ్రీరాములు, సులోచన దంపతుల కొడుకు మహేష్ భూపతి. ఇతని వయస్సు 14 ఏళ్ళు.కాని, బరువు మాత్రం 150 కిలోలు. అసాధారణంగా మహేష్ బరువు పెరుగుతున్నాడు.

ఇటీవలే మహేష్ తండ్రి అనారోగ్య కారణాలతో చనిపోయాడు. దీంతో మహేష్ ను తీసుకొన్ని తల్లి తన పుట్టింటికి వచ్చింది. మహేష్ ను చిన్నా అని కూడ పిలుస్తారు. చిన్నా ఆకలికి తట్టుకోడు. ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు.
సమయానికి తినకపోతే మాత్రం ఇబ్బంది పడతాడని మహేష్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. మహేష్ అసాధారణంగా బరువు పెరగడం పై పలువుురు వైద్యులకు చూపిన పలితం లేకపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.చిన్నా గ్రామంలోని ఎవరి ఇంటికైనా వెళ్ళి అడిగితే చిన్నాకు ఏదైనా ఇచ్చి అతని ఆకలితీరుస్తారు.












Click it and Unblock the Notifications