వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'లోకసభ' సీన్ రివర్స్, చంద్రబాబుకు భారీ దెబ్బ: ఏపీలో జగన్ పార్టీకి 21, టీడీపీకి 4 సీట్లే!

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబుకు భారీ దెబ్బ: ఏపీలో జగన్ పార్టీకి 21, టీడీపీకి 4 సీట్లే!

హైదరాబాద్/అమరావతి/న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఎవరు ప్రధాని అవుతారని తెలుసుకునేందుకు ఏబీపీ - సీ ఓటరు సంయుక్తంగా దేశ్ గా మూడ్ పేరుతో సర్వే చేసింది. ఈ సర్వేలో బీజేపీకి సీట్లు తగ్గినా నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతాడని వెల్లడైంది.

ప్రధానమంత్రిగా కూడా ఎక్కువ మంది మోడీనే కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ సహా ఎవరూ ఆయనకు అందనంత దూరంలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోను ఏబీపీ - సీ ఓటరు సర్వే చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు ఎక్కువ సీట్లు పొందనున్నాయని తేలింది.

21 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్, టీడీపీ 4 చోట్ల

21 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్, టీడీపీ 4 చోట్ల

ఏబీపీ - సీ ఓటరు సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించనుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఈ పార్టీ ఏకంగా 21 లోకసభ స్థానాల్లో విజయం సాధించనుందని తేలింది. గత ఎన్నికల్లో వైసీపీ తక్కువ స్థానాల్లో గెలవగా, టీడీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. కానీ ఈసారి ఏపీలోని 25 అసెంబ్లీ స్థానాలకు గాను జగన్ పార్టీయే ఏకంగా 21 స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. తెలుగుదేశం పార్టీ కేవలం 4 సీట్లకే పరిమితం అవుతుందట.

రంగంలోకి పవన్ కళ్యాణ్, మార్పులు

రంగంలోకి పవన్ కళ్యాణ్, మార్పులు

ఏపీబీ - సీ ఓటరు సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రభావం లేదని తేలింది. గత ఎన్నికల్లో కంటే కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ, అలాగే బీజేపీ గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచినప్పటికీ ఈసారి ఈ పార్టీలు సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదని సర్వేలో తేలింది. ఇక జనసేన పూర్తిగా రంగంలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో జరిగిన సర్వే ఫలితాలు ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నందున అప్పటికి మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణలో తెరాసదే హవా

తెలంగాణలో తెరాసదే హవా

ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎన్డీయే కూటమికి 17 స్థానాలకు గాను 15 స్థానాలు వస్తాయని ఏబీపీ - సీ ఓటరు సర్వేలో వెల్లడైంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్డీయే భాగస్వామిగా పేర్కొన్నట్లుగా ఉంది. అందుకే ఎన్డీయే కూటమికి 15 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. తెరాస మాత్రం తమకు బీజేపీతో సంబంధం లేదని తేల్చి చెబుతోంది. ఏదేమైనా ఈ లెక్కన తెరాసకు 14, బీజేపీకి 1 సీటు వచ్చే అవకాశముంది. యూపీఏ 1 సీట్లు, ఇతరులు (మజ్లిస్) ఒక సీటు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది.

దక్షిణాదిన ఇదీ లెక్క

దక్షిణాదిన ఇదీ లెక్క

దక్షిణ భారత దేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 129 స్థానాలు ఉండగా, ఎన్డీయే 21, యూపీఏ 32, ఇతరులు 76 స్థానాలు గెలుచుకుంటారని ఏబీపీ - సీ ఓటరు సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.

English summary
In Andhra Pradesh, there are total of 25 seats to grab, and the contest is expected to be between YS Jagan Mohan Reddy's YSRCP and Chandrababu Naidu's TDP, with Congress and BJP expected to be outsiders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X