వాహనదారులకు కీలక అలెర్ట్.. మొబైల్ నంబర్ అప్డేట్ చెయ్యకుంటే మీకు తిప్పలే!

తెలంగాణలోని వాహనదారులందరికీ రవాణాశాఖ ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. ఈ-చలాన్లు, కోర్టు నోటీసులు, ఆర్టీఏ సమాచారం వంటి ముఖ్యమైన అధికారిక సందేశాలను సకాలంలో అందుకోవాలంటే వాహన్ పోర్టల్‌లో తమ లేటెస్ట్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీని తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ వివరాలు అప్‌డేట్ చేయకపోతే పెండింగ్ జరిమానాలు పేరుకుపోయి, భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

వాహన్ పోర్టల్‌లో మొబైల్, ఈమెయిల్ అప్డేషన్ పై అలెర్ట్

చాలామంది వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన పాత మొబైల్ నంబర్లు లేదా ఈమెయిల్ ఐడీలు ఇప్పటికీ వాహన్ డేటాబేస్‌లోనే ఉండిపోతున్నాయి. కాలక్రమేణా సిమ్ నంబర్లు మారినా, కొత్త ఈమెయిల్ ఐడీలు తీసుకున్నా వాటిని అప్‌డేట్ చేయడం లేదు. దీంతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఈ-చలాన్లు, వాహన ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ బదిలీలు, కోర్టు సమన్స్ వంటి ముఖ్యమైన సమాచారం పాత నంబర్లకు వెళ్తోంది.

Telangana Transport Dept Urges Motorists to Update Mobile Numbers amp amp Email on Vahan Portal Immediately

ఇన్ఫర్మేషన్ అందలేదంటే చెల్లదన్న అధికారులు

ఫలితంగా వాహన యజమానులు తమపై ఎన్ని జరిమానాలు పడ్డాయో కూడా తెలియకుండా పోతున్నారు. రవాణాశాఖ అధికారుల ప్రకారం, వాహన్ పోర్టల్‌లో నమోదైన కాంటాక్ట్ వివరాలకు పంపిన ఏ సందేశమైనా చట్టపరంగా వాహన యజమానికి అందినట్లుగానే పరిగణించబడుతుంది. "నోటీసులు రాలేదు", "పాత నంబర్ పని చేయడం లేదు" అనే వాదనలు కోర్టులోనో, ఇతర అధికారిక వేదికల ముందో చెల్లవని అధికారులు తేల్చి చెప్పారు.

వాహన్ అధికారిక వెబ్‌సైట్‌ లో మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ మస్ట్

ఈ నిర్లక్ష్యం వల్ల పెండింగ్ ఫైన్లు పేరుకుపోవడమే కాకుండా వాహన బదిలీలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణ వంటి పనుల్లో తీవ్రసమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి వాహనదారులు సులభంగా వాహన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వాహన నంబర్ ద్వారా లాగిన్ అయి కొత్త మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇంకా సులభంగా చేయాలని రవాణాశాఖ ప్రత్యేక QRకోడ్‌ను కూడా విడుదల చేసింది.

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఉచితంగా కాన్వా, దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ!
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఉచితంగా కాన్వా, దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ!

కోడ్‌ను స్కాన్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు

స్మార్ట్‌ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుంది. తెలంగాణ రవాణా శాఖ ఈ చర్య ద్వారా డిజిటల్ సేవలను మరింత ప్రభావవంతంగా అందించాలని భావిస్తోంది. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ వివరాలను సరిచేసుకోవాలని ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ఈ చిన్న అప్‌డేట్ వల్ల భవిష్యత్తులో అనవసరమైన ఇబ్బందులు, ఆర్థిక నష్టాలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు.ఇలాంటి డిజిటల్ అప్‌డేట్‌లు వాహన సంబంధిత సేవలను మరింత సులభం చేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+