నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్: విశాఖ అమ్మాయి అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. బిఎస్సి చివరి సంవత్సరం చదువుతున్న పొళ్లమూరి భాగ్య శ్రీరామ అమృత, ఆమె సహచర విద్యార్థినితో ఓ చిన్న విషయంలో గొడవ పడింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అమృత ఎలాగైనా ఆమెపై పగను తీర్చుకోవాలని అనుకుంది.
సైబర్ నేరాలపై పూర్తి అవగాహన లేని అమృత, తను గొడవ పడిన అమ్మాయి పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి అందులో ఆమె ఫొటోలను, ఫోన్ నెంబర్‌ను అప్‌లోడ్ చేయడంతోపాటు అసంబద్ధమైన, అవివేకమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసింది. కాగా ఆ నకిలీ ఖాతాను చూసిన బాధితురాలు, తన కుటుంబ సభ్యులతోపాటు వెళ్లి విశాఖపట్నంలోని నాలుగవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసును సిసిఐసి పోలీసులకు బదిలీ చేయడంతో విచారణ జరిపిన వారు నిందితురాలిగా అమృతను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలిపై ఐటి యాక్ట్ 2000, 2008 సెక్షన్ 66 (ఏ), 66 (సి) కింద కేసు నమోదు చేసిన పోలీసులు, టాబ్లెట్ పిసిని, ఆమెకు సంబంధించిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications