స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీ కోచ్ లో ప్రయాణం?
వేసవి వచ్చిందంటే ఏ ప్రాంతానికి వెళ్లాలి? ఎక్కడెక్కడ పర్యటించాలి? అంటూ రకరకాల ప్రణాళికలు రచించుకుంటారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు రైలులో రిజర్వేషన్ చేయించుకుంటారు. అయితే స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీ కోచ్ లో కూడా ప్రయాణించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు టికెట్ బుక్ చేసుకున్నఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు ప్రయాణికులు ఏ కోచ్ లో బెర్త్ కావాలంటే ఆ కోచ్ లోనే లభించేది.
ఒకవేళ ఆ బోగీలో బెర్త్ లేకపోతే టికెట్ రద్దయ్యేది. కానీ ప్రస్తుతం ప్రయాణికులు తాము ఎంచుకున్న కోచ్ లో బెర్త్ దొరక్కపోతే వారికి అంతకంటే ఎక్కువ ఉన్న కోచ్ లో సీటు లభిస్తుంది. అయితే ఇలా బెర్త్ పొందాలంటే ఆ బోగీలు సీటు ఖాళీగా ఉండాలి. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ద్వారా ఓ ప్రయాణీకుడు స్లీపర్ క్లాసులో టికెట్లు బుక్ చేసుకుంటాడు. ఆ బోగీలో బెర్త్ ఖాళీ లేకపోతే.. అతడికి థర్డ్ ఏసీలో ఖాళీగా ఉన్న బెర్త్ లభిస్తుంది.

ఒక్క స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు మాత్రమే కాదు.. ఈ ఆప్షన్ ద్వారా థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నవారికి సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నవారికి ఫస్ట్ ఏసీ వచ్చే అవకాశం ఉంది. హయ్యర్ కోచ్‌ల్లో సీట్లు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది. ఈ ఆప్షన్ ఎంచుకున్న చాలామంది స్లీపర్ క్లాస్ ప్రయాణికులు అదే రైలు టికెట్లతో థర్డ్ ఏసీలో ప్రయాణించారు. ఆన్‌లైన్ ద్వారా ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కౌంటర్లలో బుక్ చేసుకునేవారికి ఈ ఫీచర్ పనిచేయదు.












Click it and Unblock the Notifications