రూ. 130 కోట్లకు పడగెత్తిన ఆదిశేషు: ఆస్తుల జప్తు

విజయవాడ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఆబ్కారీ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఆస్తలను అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) గురువారంనాడు జప్తు చేసింది. ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది.

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో విధులు నిర్వహిస్తున్న ఆదిశేషు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఆయన నివాసంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో, గుంటూరు జిల్లాలో ఆయన బంధువుల ఇళ్లలో ఎసిబి సోదాలు నిర్వహించింది.

ఏక కాలంలో చేసిన సోదాల్లో ఆదిశేషు దాదాపు రూ.130 కోట్ల అస్తులు కూడబెట్టినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతని ఆస్తులను ఎసిబి జప్తు చేసింది. పొలాలు, స్థలాలు, బ్యాంకు లాకర్లలో కేజీల కొద్దీ వెండి బంగారు ఆభరణాలు, 15 దాకా ఏటీఎం కార్డులు సంపాదించుకున్నాడు.

ACB attaches Adiseshu's properties

అంతేకాకుండా, ప్రామిసరీ నోట్లు, చెక్కులు వెలుగు చూశాయి. వీటిలో ఎక్కువ భాగం బినామీల పేర్ల మీదనే ఉన్నాయి. అక్రమార్జన ఆరోపణలపై బుధవారం విజయవాడ మొగల్రాజపురంలోని అతని నివాసం, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోని బంధువుల నివాసాలపై ఏసీబీ కేంద్రీయ విభాగం డీఎస్పీ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో దాడులు జరగడం తెలిసిందే.

గత గురు, శుక్రవారాల్లోనూ కొనసాగిన తనిఖీల్లో ఆదిశేషు అక్రమాస్తులు భారీగా వెలుగు చూశాయి. విజయవాడ పాలిక్లినిక్‌ రోడ్డులోని లక్ష్మివిలాస్‌ బ్యాంకులోని రెండు లాకర్లను తెరవగా 6.80 కిలోల ఖరీదైన బంగారు బిస్కెట్లు, వజ్రాభరణాలు కనిపించాయి.

ఏడువారాల నగలు, కంఠాభరణాలు, ఆఖరికి బంగారు ఉగ్గుపాల గిన్నె కూడా ఉన్నాయి. దీంతో మొత్తం 7.20 కిలోల బంగారం ఇప్పటి వరకు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి వెండి, బంగారు నగలను సీజ్‌ చేసి ట్రెజరీలో అప్పగిస్తామన్నారు. అతని ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.50కోట్లని చెప్పారు.

గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యంత ఖరీదైన భూములు, స్థలాలు, భవనాలను నేటి మార్కెట్‌ విలువ ప్రకారం లెక్కిస్తే రూ.120-150 కోట్ల పైచిలుకేనని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క బంగారు నగల విలువే రూ.7-8 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు.

ఆదిశేషు పెద్దమొత్తాల్లో కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. ఇంట్లోను, లాకర్లలోనూ కలిపి 30 సంతకాలు పెట్టిన ఖాళీ ప్రామిసరీ నోట్లు లభించినట్లు తెలుస్తోంది. కాల్‌మనీ కింద రూ.5-7 కోట్లు రుణాలు ఇచ్చి ఉంటాడని అంచనా. మరో మూడు నాలుగు రోజులు సోదాలు కొనసాగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+