లిక్కర్ కేసులో కీలక మలుపు - ధనుంజయరెడ్డి సహా మరో ఇద్దరికి బెయిల్

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదయం ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది. కాగా, ఇప్పుడు ఈ కేసులో రిమాండ్ లో ఉన్న మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తో పాటుగా బాలాజీ గోవిందప్పకు బెయిల్ వచ్చింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పలు షరతులు విధించింది.

లిక్కర్ కేసులో కీలకంగా భావించిన ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి ఈ కేసులో ఏ 31గా ఉన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి ధనుంజయ రెడ్డి పాత్ర పైన సెట్ అనేక అంశాలను ఛార్జ్ షీట్ లో ప్రస్తావన చేసింది. అదే విధంగా జగన్ ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ దక్కింది. ఇక.. ఈ కేసులో ఏ 33గా ఉన్న బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు అయింది. ఈ ముగ్గురు ఒక్కొక్కరూ రూ లక్ష చెప్పున రెండు షూరిటీ ఇవ్వాలని... పాస్ పోర్టులను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు ఈ ముగ్గురు బయటకు రావటానికి అవకాశం ఏర్పడింది.

acb-court-grants-bail-for-dhanunjarayana-reedy-along-with-two-others-details-here

ఈ రోజు ఉదయమే ఎంపీ మిథున్ రెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కోసం మిథున్ రెడ్డికి వెసులుబాటు ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మిథున్ రెడ్డి తిరిగి ఈ నెల 11న సరెండర్ కావాల్సి ఉంది. దీంతో, కొద్ది సేపటి క్రితమే మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. కాగా.. ఇదే రోజున ఈ కేసులో దాదాపు 120 రోజులుగా రిమాండ్ లో ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు అయింది. మూడు సార్లు ఈ ముగ్గురు బెయిల్ కోసం ప్రయత్నించారు. తాజాగా చేసిన వాదనల్లో తాము 90 రోజులకు పైగా రిమాండ్ లో ఉన్నామని.. కేసులో కొత్తగా పురోగతి లేదని వాదనలు వినిపించారు. ఇక.. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 12 మందిలో ఎనిమిది మందికి బెయిల్ దక్కటం కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+