లిక్కర్ చార్జిషీట్లపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు, వారి అరెస్ట్ ఏమైంది - అధికారికి మెమో..!!
రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో సిట్ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఈ సమయంలోనే ఇప్పటికే దాఖలైన ఛార్జ్ షీట్ల పై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అవినీతి నిరోధక చట్టం ఈ కేసుకు ఎలా వర్తిస్తుందో తెలియజేయాలని అడిగింది. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలంటూ దర్యాప్తు అధికారికి కోర్టు మెమో జారీ చేయటం కీలకంగా మారింది.
ఏపీలో లిక్కర్ కేసు రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు జైలులో ఉన్నారు. ఈ కేసులో సిట్ దాఖలు చేసిన రెండు చార్జిషీట్లపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ రెండు చార్జిషీట్లపై మొత్తం 21 అభ్యంతరాలకు మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని దర్యాప్తు అధికారికి న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం మెమో జారీ చేశారు. నిందితులందరికీ ఈ కేసుకు సంబంధించిన కాపీలు అందించారా అని కోర్టు ప్రశ్నించింది. అవినీతి నిరోధక చట్టం ఈ కేసుకు ఎలా వర్తిస్తుందో తెలియజేయాలని అడిగింది. ఇప్పటివరకు ఎంతమంది సాక్షులను సిట్ విచారించిందో తెలియజేయాలని, ఎంతమంది సాక్షుల నుంచి సీఆర్పీసీ 161 వాంగ్మూలం నమోదు చేశారు అని కోర్టు ప్రశ్నించింది.

దీనికి కొనసాగింపుగా సిట్ దాఖలు చేసిన రెండు చార్జిషీట్లలో ప్రిలిమినరీ/ఫైనల్ చార్జిషీట్ అని చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేసింది. ఫోరెన్సిక్ నివేదికలు కోర్టుకు సమర్పించకుండా చార్జిషీటు ఎలా అర్హత పొందుతుందని అడిగింది. కేసులో 7 నుంచి 15 మంది వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని మెమోలో ప్రశ్నించింది. చార్జిషీట్‌లో ప్రేయర్ పోర్షన్ సరిగ్గా సమర్పించాలని సిట్‌ను న్యాయాధికారి భాస్కరరావు ఆదేశించారు. కాగా, మద్యం కుంభకోణంలో దాఖలు చేసిన రెండు చార్జిషీట్ల కాపీలను పెన్‌డ్రైవ్‌లో నిందితులకు అందజేయాలని సిట్ నిర్ణియించింది. కాగా, ఇదే కేసులో రిమాండ్ లో ఉన్న చెవిరెడ్డి దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్ల విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications