వార్నీ.. ఇది ఇల్లా... షాపింగ్‌ మాలా? ఏసీబీ అధికారులే షాక్ తిన్నారంటే...

అవినీతి తిమింగలం సురేశ్‌ బాబుకు చెందిన హైదరాబాద్‌లోని ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ వస్తువులను చూసి ఏసీబీ అధికారులు షాక్ తిన్నారు.

అమరావతి: ఓ అవినీతి అధికారి పట్టుబడితే కోట్ల విలువ చేసే ఆస్తి పత్రాలు, బంగారం, నగదు, లగ్జరీ కార్లు దొరకడం మామూలే! భారీ అవినీతి ఆరోపణలతో సోమవారం ఏసీబీకి పట్టుబడ్డ పరిశ్రమల శాఖ ఏడీ బయ్యవరపు సురేశ్‌ బాబు కొంచెం రొటీన్‌కు భిన్నం.

హైదరాబాద్‌లోని అతడి ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఆస్తులతో పాటు ఎవరూ ఊహించని విధంగా పట్టుబడ్డ వస్తువులను చూసి ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. అతడి ఇంట్లో ఉన్న కుమార్తె నగలు, కాస్మొటిక్స్‌, దుస్తులు, చెప్పులు చూసి అవాక్కయ్యారు. అవన్నీ చూశాక 'అది ఇల్లులా లేదు.. షాపింగ్‌ మాల్‌లా ఉంది..' అని ఏసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఎట్టకేలకు దొరికిన అవినీతి తిమింగలం...

ఎట్టకేలకు దొరికిన అవినీతి తిమింగలం...

పరిశ్రమల శాఖ అధికారిగా విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్న సురేశ్ బాబు కోసం ఏసీబీ అధికారులు వారం రోజుల పాటు వేట సాగించారు. వారి నిఘాకు సైతం దొరకుండా తప్పించుకుని తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ లాడ్డిలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసున్నారు. అతడిని ప్రశ్నిస్తోంటే ఒక్కొక్కటిగా అక్రమాస్తులు వెలుగులోకి వస్తున్నాయి.

షాపింగ్ మాల్ ను తలపించేలా...

షాపింగ్ మాల్ ను తలపించేలా...

అక్కడ 250 చెప్పులు, 313 జతల దుస్తులు, పెద్ద బ్యూటీ పార్లర్‌లో కూడా లేనంతగా బస్తాల కొద్దీ లిప్‌స్టిక్‌లు, నెయిల్‌ పాలిష్‌, ఇతర కాస్మొటిక్స్‌ కనిపించాయి. అక్కడ దొరికిన ఆ చెప్పులు ఒక్కొక్క జత ఐదారు వేల రూపాయలకు తగ్గకుండా ఉన్నాయి. ఇక దుస్తులైతే చెప్పక్కర్లేదని, అవినీతి అధికారి కుమార్తె గదిలోకి వెళితే ఒక వస్త్ర దుకాణంలో ఉన్నట్లుగా అనిపించిందని సోదాలకు వెళ్లిన ఏసీబీ అధికారులు విజయవాడ కార్యాలయంలోని ఉన్నతాధికారులకు సెల్‌ఫోన సందేశంలో తెలిపారు.

అలంకారానికి అద్దాల గది...

అలంకారానికి అద్దాల గది...

ఆమె అంలంకారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న అద్దాల గదిలో ఎటు చూసినా కాస్మొటిక్స్‌ కనిపించాయి. పైగా అవన్నీ బ్రాండెడ్‌ కంపెనీలకు చెందినవని, ఒక్కో లిప్‌స్టిక్‌ రూ.3 వేలు, నెయిల్‌పాలిష్‌ రూ.2500కు తగ్గకుండా ఉన్నాయి. ఇవన్నీ చూసి నివ్వెర పోయిన ఏసీబీ అధికారులకు మరో షాక్‌ తగిలింది. సురేశ్‌ బాబు భార్య పూజ గదిలో ప్రత్యేకంగా వెండితో చేయించిన కరెన్సీ నోట్లు కిలోల కొద్దీ బయటపడ్డాయి.

ఇబ్బడిముబ్బడిగా బ్యాంకు లాకర్లు...

ఇబ్బడిముబ్బడిగా బ్యాంకు లాకర్లు...

సోమవారం ఏడు బ్యాంకులకు సంబంధించిన లాకర్ల ఆధారాలు లభించగా మంగళవారం నాటికి అవి 15కు చేరాయి. అందులో రెండింటిని ఇప్పటికే క్లోజ్‌ చేశారని, కొన్నింటిని తెరిచామని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్‌ వెల్లడించారు. సోమవారం నాటితో పోల్చితే అదనంగా పిడుగురాళ్లలో ఏడు నివాస స్థలాలు, నిర్మాణంలో ఉన్న భవనం, హైదరాబాద్‌లో 8 స్థలాలు, నల్లగొండలో ఒకటి గుర్తించామన్నారు. అమీర్‌పేటలోని ఆర్బీఎల్‌ బ్యాంకు లాకర్, సైనిక్‌పురిలోని జాగృతి బ్యాంకు లాకర్ ను అధికారులు ఇంకా తెరవాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని లాకర్లను తెరిచి డబ్బులు తరలించినటు అధికారులు అనుమానిస్తున్నారు. అతడి కుమారుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

రూ.కోట్ల విలువైన భూముల పత్రాలు

రూ.కోట్ల విలువైన భూముల పత్రాలు

హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలో గల వాయుపురిలో ఉన్న జాగృతి కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో సురేశ్‌ బాబు లాకర్లను ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో మంగళవారం సాయత్రం అధికారులు తెరిచారు. రెండు లాకర్లను తెరిచి చూడగా బెంగళూరులో రెండు ఎకరాల భూమి, ఇతర ప్రాంతాల్లోని స్థలాలు, భూముల పత్రాలు ఆ లాకర్లలో లభించాయి. వీటి విలువ రూ.కోట్లలో ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. సాయత్రం ఆరు గంటల నుంచి తనిఖీలు ప్రారంభించిన ఏసీబీ అధికారుల రాత్రి 9 గంటల వరకు పత్రాల పరిశీలనలో ఉండిపోయారు.

వెండి డబ్బు.. ఆపై పూజలు!

వెండి డబ్బు.. ఆపై పూజలు!

తన భార్య కోరిక మేరకు సురేశ్ బాబు వెండితో రూ.500, రూ.1000 నోట్లను ప్రత్యేకంగా తయారు చేయించాడు. గాంధీ బొమ్మ ఉన్నచోట లక్ష్మీదేవి రూపం ఉండేలా కిలోల కొద్దీ వెండినోట్లు తయారు చేయించి భార్యకు బహుమతిగా ఇచ్చాడు. ఆ నోట్లను పూజగదిలో పెట్టి రోజూ పూజించి భర్తకు మరింత ఎక్కువ డబ్బు రావాలని ఆమె ప్రార్థించేదని తెలిసింది.

బంగారం రూ.20 లక్షలు.. చెప్పులు, కాస్మొటిక్స్‌ రూ.6 లక్షలు!

బంగారం రూ.20 లక్షలు.. చెప్పులు, కాస్మొటిక్స్‌ రూ.6 లక్షలు!

సురేశ్‌ బాబు తన కుమార్తెకు కోరిందల్లా కాదనకుండా కానుకల రూపంలో ఇస్తూ వచ్చే వారట. డ్రెస్‌లో మ్యాచింగ్‌ కోసం బంగారు నెక్లెస్ లు, చైన్లు, గాజులు, బ్రాస్‌లెట్లు, ఉంగరాలు, చెవిదుద్దులు, ముత్యాల దండలు, పచ్చల హారాలు... వేర్వేరు రకాలైనవి కొనిచ్చాడు. ఇక ఆమె ధరించే దుస్తులు, వాడే కాస్మొటిక్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. సురేశ్ బాబు కుమార్తె ధరించే బంగారు నగల విలువే రూ.20 లక్షల వరకు ఉంటే.. చెప్పులు, డ్రెస్‌లు, కాస్మొటిక్స్‌ విలువ మరో రూ.6 లక్షల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నా రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+