అటెండర్‌గా చేరి.. కళ్లు చెదిరే ఆస్తులు: రూ.50 కోట్లకు పైగా, భార్య పేరిట 46 ట్యాంకర్లు, లగ్జరీ కార్లు
విజయవాడ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రభుత్వ ఐటీఐ శిక్షణ అధికారి శ్రీనివాస్ కుమార్ ఆస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన వద్ద రూ.50 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.
ఏసీబీ మొత్తం ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. విజయవాడ, పెనమలూరులో శ్రీనివాస్ కుమార్, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ క్రమంలో ఆయన భార్య పేరిట 46 పెద్ద లారీలు, ఐచర్, మహేంద్ర, టాటా, అశోక్ లేల్యాండ్ లారీలను గుర్తించారు.

భార్య, బావమరిది, మామ పేరిట ఆస్తులు
విజయవాడలో భార్య పేరిట అపార్టుమెంట్, రెండు ఇళ్ల స్థలాలు, మామ, బావమరిది పేరిట ఆటో నగర్‌లో ఇళ్ల స్థలాలను అధికారులు గుర్తించారు. వీటితో పాటు కిలో బంగారం, 1.7 కిలోల వెండి, రూ.కోటి విలువైన నాలుగు కార్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

పలుచోట్ల సోదాలు
బెజవాడలోని పటమట విజయ్ నగర్ కాలనీలో శ్రీనందిని అపార్టుమెంటులో శ్రీనివాస్ కుమార్ ఇల్లు ఉంది. ఇక్కడ, దీంతో పాటు ఆయన కార్యాలయం సహా విజయవాడలోని పలుచోట్ల సోదాలు నిర్వహించారు.

భార్య పేరిట 46 ట్యాంకర్లు, టిప్పర్లు
శ్రీనివాస్ కుమార్తె హరిప్రియ పేరిట విజయవాడ ఆటోనగర్‌లో హరిప్రియ క్యారియర్స్ అనే ట్రాన్సుపోర్ట్ సంస్థ నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ భార్య పేరిట 46 ట్యాంకర్లు, టిప్పర్లు, రెండు ద్విచక్రవాహనాలు ఉన్నట్లు గుర్తించారు.

కోటి విలువ చేసే కార్లు
సుమారు రూ.కోటి విలువ చేసే విలాసవంతమైన నాలుగు కార్లు , శ్రీనందిని టవర్స్‌లో విలాసవంతమైన ఫ్లాట్ సహా తన బావ పేరిట 500 చ. గజాలు, మామ పేరిట మరో 500 గజాల స్థలాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువల రూ.50కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

అటెండర్ అటెండర్‌గా చేరి
విజయవాడకు చెందిన శ్రీనివాస్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తండ్రి మల్లికార్జున రావు మరణంతో 1991లో ఉద్యోగం పొందారు. ఐటీఐ జిల్లా స్థాయి శిక్షణా కేంద్రంలో స్టోర్ అటెండర్‌గా చేరారు. ఏడాదికి జూనియర్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఐదేళ్లలో డిప్యూటీ ట్రైనింగ్ అధికారి స్థాయికి చేరారు. 2014లో శిక్షణ అధికారిగా ప్రమోషన్ పొందారు. 26 ఏళ్లుగా శిక్షణా కేంద్రంలోనే తిష్టవేసి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడ బెట్టారని ఏసీబీ గుర్తించింది.












Click it and Unblock the Notifications