లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్సై
శ్రీకాకుళం: ఏసీబీ వలలో మరో అవినీతి చేప పడింది. రూ.10వేల లంచం తీసుకుంటుండగా శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీస్ స్టేషన్ ఎస్సై రవికిశోర్‌ని ఏసీబీ అధికారులు సినీ ఫక్కీలో పట్టుకున్నారు. తోటాడ గ్రామానికి చెందిన ఓ కేసు విషయమై డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించిన ఎస్సైతో పాటు కానిస్టేబుల్ త్రినాథ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. ఇది స్థానికంగా సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications