మనుషులను మింగేసిన సంద్రపు అలలు (పిక్చర్స్)

విశాఖపట్నం: సముద్రపు అలల మోసానికి ఇద్దరు బలయ్యారు. మరొకరు గల్లంతయ్యారు. సముద్ర స్నానం వారి ఉసురు తీసింది. స్నానానికి దిగిన స్నేహితులకు ఇంతటి విషాదం ఎదురవుతుందని తెలియదు. ఆదివారం రుషికొండ, ఆర్కే బీచ్‌ల్లో ఈ విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కొబ్బరితోట ఎస్‌విసి నగర్‌కు చెందిన ఎనిమిది మంది స్నేహితులు ఆదివారం మధ్యాహ్నం ఆర్కే బీచ్‌ వద్ద స్నానానికి సముద్రంలోకి అడుగు పెట్టారు. కొంత సేపు ఉల్లాసంగా గడిపారు. అక్కడి నుంచి నోవాటెల్ ఎదురుగా ఉన్న బీచ్‌కు వచ్చారు. వీరిలో ముగ్గురు బాలురు కూడా ఉన్నారు.

వారంతా స్నానానికి దిగారు. అలల ఉధృతికి కాకర చంద్రమౌళి (18), కాకర మహేష్ (19), అప్పల రాజు శ్ (24), రమేష్ (19) లోపలికి కొట్టుకుపోయారు. లైఫ్‌గార్డులు వెంటనే స్పందించి చంద్రమౌళి, రమేష్‌లను రక్షించారు. మహేష్, అప్పలరాజును రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే ఫలితం దక్కలేదు.

కొద్దిసేపటికే అప్పలరాజు మృతదేహం తీరానికి కొట్టుకుని వచ్చింది. గల్లంతైన మహేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరితో పాటు వచ్చిన రాజు, సాయి, చంద్, పైడిరాజులు క్షేమంగా బయటపడ్డారు.

అప్పలరాజు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ కుటుంబానికి సాయంగా ఉంటున్నాడు. అతని తంర్డి రామనాయుడు ఆటో డ్రైవర్, తల్లి నూకరత్నం కూలి పనులకు వెళ్తుంది. అక్కకు పెళ్లి చేశాడు. తమ్ముడిని చదవిస్తున్నాడు. ఇల్లు కట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లికి సిద్ధమైన తరుణంలో అతన్ని సముద్రం మింగేసింది.

అలల ఉధృతికి గల్లంతైన మహేష్ నిర్మాణ రంగంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల పాలిటెక్నిక్‌లో చేరాడు. తండ్రి పార్థసారథి అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం మరణించాడు. దీంతో కుటుంబ భారాన్ని మహేష్ మోస్తున్నాడు.

సముద్రం మింగేసింది..

సముద్రం మింగేసింది..

ఆదివారంనాడు సరదాగా స్నానానికి వెళ్లిన యువకుల్లో ఓ యువకుడిని సమద్రం ఇలా మింగేసింది. విగత జీవిగా ఇలా ఒడ్డుకు కొట్టుకుని వచ్చాడు.

కన్నీరు మున్నీరు...

కన్నీరు మున్నీరు...

సముద్రం ఆగ్రహానికి గురైన యువకుడి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. వారి రోదనలకు అంతు లేదు.

విషాదానికి ముందు ఇలా..

విషాదానికి ముందు ఇలా..

ఆదివారం సరదాగా ఎనిమిది మంది మిత్రులు సముద్ర స్నానానికి వెళ్లారు. అయితే, తమలో కొంత మందిని సముద్రం మింగేస్తుందని వారికి తెలియదు.

ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు..

ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు..

రెండు వేర్వేరు సంఘటనల్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు మరణించగా, ఒకరు గల్లంతయ్యారు. వారి కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+