అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం..గాయాలు: డివైడర్ ను ఢీకొన్న కారు: ఫోన్‌లో బాబు పరామర్శ..!

టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొంది. అచ్చెన్నాయుడు శుక్రవారం సాయంత్రం అమరావతి నుంచి కారులో విశాఖ బయలుదేరారు. రాత్రి 10:15 గంటల సమయంలో నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపానికి వచ్చేసరికి ఒక బైక్‌ అడ్డంగా వచ్చేసింది.

బైక్‌ను తప్పించే క్రమంలో కారు డ్రైవర్‌ అప్పన్న పక్కకు పోనివ్వడంతో వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. అచ్చెన్నాయుడి ఎడమ చేయి చిటికెన వేలుకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను నక్కపల్లి సీఐ విజయ్‌కుమార్‌ పోలీస్‌ వాహనంలో నక్కపల్లి 30 పడకల ఆస్పత్రికి తరలించారు.

టూ వీలర్ ను తప్పించబోయి..
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు నక్కపల్లి బస్టాండ్ వద్దకు రాగానే రెడ్డుకు అడ్డుగా వచ్చిన ద్విచక్ర వాహనానని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. డ్రైవర్ చాకచక్యం గా వ్యవహరించటంతో పెద్ద ప్రమాదం తప్పింది.విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసు అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.

ప్రమాదంలో కారు దెబ్బ తిన్నది. అక్కడికి చేరుకున్న వెంటనే పోలీసులు ఆయన్ను నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఎడమచేతి వేళ్లకు గాయం కావటంతో వైద్యులు కుట్లు వేసారు. ఆ తరువాత అచ్చెన్నాయుడు మరో కారులో బయల్దేరి తిరిగి వెళ్లిపోయారు.

Achamnaidu met an accident in Vizag..he is safe

చంద్రబాబు పరామర్శ..
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు... నేరుగా అచ్చెన్నాయుడికి ఫోన్‌ చేసి పరామర్శించారు. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, శ్రీకాకుళం టీడీపీ నేతలు, ఆయన కుటుంబసభ్యులు, పార్టీ పెద్దలు ఫోన్‌ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

తొలుత అచ్చెన్నాయుడు కారుకు ప్రమాదం అనగానే..అందరిలో టెన్షన్ మొదలైంది. అయితే, చిన్నపాటి గాయాలతో బయట పడటంతో పార్టీ నేతలతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+